Switch to English

YSRCP: నిజమే అబద్ధం.! అబద్ధమే నిజం.! ఇదీ వైసీపీ సిద్ధాంతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

YSRCP: అదేంటో, నిజం అబద్ధంగా చూపబడుతుంది. అబద్ధమేమో నిజంగా మార్చబడుతుంది.! వైసీపీ కళ్ళతోనే ఏదైనా చూడాలి.! వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే, దాన్ని గుండె పోటుగానే చూడాలి.!

ఎందుకంటే, తొలుత వైసీపీ ఈ విషయాన్ని అలాగే జనానికి చూపించింది. కానీ, అది హత్య అని తేలాక, నారాసుర రక్త చరిత్రగా చూపించే ప్రయత్నం చేసింది వైసీపీ. అదీ కుదరకపోవడంతో, అక్రమ సంబంధాలే హత్యకు కారణమంటూ కొత్త కథ అల్లింది వైసీపీ.

ఇది మచ్చుకు ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.! ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, సీపీఎస్ రద్దు, మద్యనిషేధం విషయంలో కావొచ్చు.. దేని మీద అయినా వైసీపీది ఒకటే సిద్ధాంతం.. నిజమే అబద్ధం.. అబద్ధమే నిజం.!

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు విషయంలో రాద్ధాంతం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొంది, జనసేన పార్టీకి కామన్ సింబల్ వుందనీ, అది గ్లాసు గుర్తు మాత్రమేనని. కానీ, వైసీపీ దుష్ప్రచారం వేరేలా వుంది. జనసేనకు కామన్ సింబల్ పోయిందన్నది వైసీపీ చేస్తున్న ప్రచారం.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మీడియా లేదట. ఆయనేమో పేదోడట.! మరి, సాక్షి సంగతేంటి.? ఆ సాక్షికి ప్రభుత్వం ఇస్తున్న వందల కోట్ల విలువైన ప్రకటనల సంగతేంటి.? అసలు పేదిరకమంటే అర్థమేంటి.? నిజమే అబద్ధం.. అబద్ధమే నిజం.! ఈ పేదరికం విషయంలోనూ అంతే.

బకాయిల కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించలేమని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఈ విషయమై జనసేన పార్టీ స్పందించింది. తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వమూ ఆదరాబాదరాగా కొంతమేర బకాయిలు చెల్లించక తప్పలేదు. ఇంకా బకాయిలున్నాయని ప్రభుత్వమే పేర్కొంటోంది.

ఇంతలోనే, విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన.! ఏది దుష్ప్రచారం.? ఏది వాస్తవం.? జనాన్ని ఇంకెన్నాళ్ళిలా మభ్యపెట్టి మాయ చేస్తారు.? రాజధాని అమరావతిని స్మశానమనీ, ఎడారి అనీ, ముంపు ప్రాంతమనీ పేర్కొని.. ఇప్పుడక్కడ పేదలకు ఇళ్ళు ఇవ్వడం గొప్ప కార్యక్రమంగా వైసీపీ చెబుతోంది.

స్మశానం కదా.? ఎడారి కదా.? ముంపు ప్రాంతం కదా.? అక్కడెలా పేదలకు భూముల్ని ఇస్తారుట.? అలాగని ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడి.? వైసీపీ చెబితే స్మశానం.. వైసీపీ చెబితే అది పేదలకు అనువైన ప్రాంతం. వైసీపీ చెబితే గుండె పోటు.. అదే వైసీపీ మళ్ళీ చెబితే అది దారుణ హత్య.! వైసీపీ చెబితే వాస్తవం. అదే మాట వైసీపీ ఇంకోసారి చెబితే దుష్ప్రచారం.!

మొత్తంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పూర్తిస్థాయి అయోమయంలోకి నెట్టేయడం.. అంతా తమ కళ్ళతోనే చూడాలన్న మోనార్కిజం.. ఇవన్నీ వైసీపీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిజమేమో అబద్ధంగా.. అబద్ధమేమో నిజంగా మార్చబడుతోందంటే.. వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని అర్థం.! ఇది అత్యంత ప్రమాదకరం.! విషపూరిత నైజం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...