Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: ఎవరు తంతే ఎవరు ఎక్కడ పడతారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీకీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. కృష్ణా జిల్లా పర్యటనలో బాగంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, రైతుల సమస్యల్ని ప్రస్తావించారు.. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రుల్ని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘ఏ నాని అయితేనేం.. శతకోటి లింగాల్లో బోడి లింగం.. అలాగే ఎవరో ఒక నాని..’ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి మింగుడు పడ్డంలేదు.

అన్నిటికీ మించి, ‘సీఎం సాబ్‌’ అంటూ వైఎస్‌ జగన్‌ని అభివర్ణించడం వైసీపీలో సదరు ‘నానీ’లకు నచ్చినట్టు లేదు. దాంతో, నానా యాగీ మొదలు పెట్టారు. ‘మేం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని సీఎం సాబ్‌ అని మాత్రమే అన్నాం కదా.. మీరెందుకు, షకీలా సాబ్‌ అంటూ మా పవన్‌ కళ్యాణ్‌ మీద విమర్శలు చేశారు.?’ అన్నది జనసేన నేతల వాదన. బహుశా ‘బోడి లింగం’ కామెంట్స్‌కి సోకాల్డ్‌ నానీలు హర్ట్‌ అయినట్టున్నారు. దానికి ఫలితం అనుభవిస్తున్నారు.

మరీ ముఖ్యంగా, ఈ ‘బోడి లింగం’ డిస్కషన్‌ పక్కకి వెళ్ళి, ‘ఖైదీ సాబ్‌’ అంశం తెరపైకొచ్చింది. ‘పవన్‌ కళ్యాణ్‌ని షకీలా సాబ్‌ అంటారా.? అయితే, మేం ఖైదీ సాబ్‌.. అంటాం..’ అంటూ వైసీపీకి దిమ్మ తిరిగే షాకిచ్చారు జనసేన నేతలు. ఆ మంత్రీ, ఈ మంత్రి అని తేడా లేకుండా.. చాలామంది మంత్రులు.. వారితోపాటు ఎమ్మెల్యేలు, పవన్‌ కళ్యాణ్‌పై నోరు పారేసుకుంటున్న నేపథ్యంలో, అందరికీ సమానంగా వడ్డించేస్తున్నారు జనసేన నేతలు.

‘ఇంతమంది జనసేన నేతలున్నారా.?’ అని వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపడేలా, రోజుకో జనసేన నేత, అధికార పార్టీని కడిగి పారేస్తుండడం గమనార్హం. మొన్న ‘బోడి లింగం’, ‘బోడి లింగం నాని’, ‘బోడి లింగమ్స్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో వుంటే, ఆ తర్వాత ‘ఖైదీ సాబ్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నడిచింది. తాజాగా ‘ఖైదీ నెంబర్‌ 6093’ హ్యాఫ్‌ ట్యాగ్‌ ప్రచారంలోకి వచ్చింది. ఈ ‘ఖైదీ’ హ్యాష్‌ ట్యాగ్‌లు, ‘బోడిలింగం’ హ్యాష్‌ ట్యాగ్‌లకంటే ఎక్కువ సర్క్యులేట్‌ అవుతున్నాయి.

అన్నట్టు, కొందరు జనసేన నేతలైతే, ‘ఖైదీ సాబ్‌’, ‘ఖైదీ నెంబర్‌ 6093’ అంటూ పోస్టర్లు కూడా విడుదల చేస్తున్నారు. ఇవన్నీ జగన్‌ ఇమేజ్‌ని దారుణంగా డ్యామేజ్‌ చేస్తున్నాయి. చూస్తోంటే, టీడీపీ డైరెక్షన్‌లో సదరు వైసీపీ నానీలే, వైఎస్‌ జగన్‌ని ఈ వివాదంలో ఇరికించేశారా.? అన్న అనుమానాలు కలగక మానదు. ‘ప్యాకేజీ’ అంటూ పవన్‌ మీద విమర్శలు చేస్తున్న సదరు వైసీపీ నానీలు, ఇప్పుడు ఏ ప్యాకేజీ తీసుకుని, జగన్‌ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేస్తున్నారట.? అన్న చర్చ ఇటు మీడియా, అటు రాజకీయ వర్గాలతోపాటు, సోషల్‌ మీడియాలోనూ హాట్‌ హాట్‌గా జరుగుతోంది.

‘తంతే పక్క దేశంలో పడతావ్‌’ అని ఓ నాని, జనసేన అధినేతకు వార్నింగ్‌ ఇచ్చేశారు. ‘టచ్‌ చేసి చూడు..’ అంటూ సదరు నానికి సవాల్‌ విసురుతున్న జనసేన నేతలు, ‘మేం గనుక తంతే, నువ్వు, నీ ఖైదీ సాబ్‌.. చంచల్‌గూడా జైల్లో పడతారు..’ అని సెటైర్లు పేల్చుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...