‘కరోనా వైరస్ బారిన పడ్డవారికి కోలుకున్నాక 2 వేల రూపాయల ఆర్థిక సాయం..’ అని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘనంగా ప్రకటించేశారు. కానీ, అప్పట్లోనే చాలామంది ‘మాకు కరోనా సాయం అందలేదు’ అంటూ గగ్గోలు పెట్టారు. కొందరికి మాత్రం అందింది. ‘పైనుంచి నిధులు విడుదలవ్వలేదు.. అందుకే ఇవ్వలేకపోతున్నాం.. వివరాలు తీసుకుంటున్నాం.. నిధులు విడుదలయ్యాక ఇస్తాం..’ అని అధికారులు చెప్పిన విషయాన్ని పేర్కొంటూ కరోనా బాధితులు వాపోయిన సందర్భాల్ని మీడియాలో తిలకించాం. ఇక, ఇప్పుడు ‘కరోనా సాయం’ నిలిపేసినట్లు అధికారులు చెబుతున్నారట.
రోజురోజుకీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అంత ఎక్కువమందికి కరోనా సాయం అందించలేని దుస్థితి నెలకొందట. పరిస్థితులు ఇలా వుంటాయని వైఎస్ జగన్ ప్రభుత్వానికి తెలియదా.? రాష్ట్రంలో కరోనా విలయతాండవాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయలేదా.? లేదంటే, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్‌గానే భావించాలా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. అంతేనా, మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లోనూ రాష్ట్రానిది రెండో స్థానం. రాష్ట్రంలో పరిస్థితి ఇంత తీవ్రంగా వున్న నేపథ్యంలో 2 వేల కరోనా సాయం.. అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. ఏమో, మహారాష్ట్రతో పోటీ కదా.. ముందు ముందు రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రస్తుతం రోజువారీగా 60 వేలకు అటూ ఇటూగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు జరుగుతున్నాయి. మహారాష్ట్రంలో ఈ సంఖ్య 90 వేలకు పైనే నమోదవుతోంది. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అయితే లక్షకు పైగా టెస్టులు జరుగుతున్న విషయం విదితమే. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు జరిగితే, రోజుకి 20 వేల కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యమేముంటుంది.?
ఏదిఏమైనా, సంక్షేమ పథకాల్లో మేమే గొప్ప.. అని చెప్పుకోవడంలో పెడుతున్న శ్రద్ధ వాటి అమలులో వుండడంలేదన్న విమర్శలపై జగన్ సర్కార్ కాస్త దృష్టిపెడితే మంచిది. ‘మాట తప్పం.. మడమ తిప్పం..’ అని చెప్పుకున్న జగన్ ప్రభుత్వం, కరోనా సాయం విషయంలో ఎందుకు రివర్స్ గేర్ వేస్తోందో.. ప్రభుత్వ పెద్దలే సమాధానమివ్వాలి.
731153 258223There is noticeably a bundle to know about this. I assume you produced certain nice points in attributes also. 115603
187978 923572Amaze! Thank you! I constantly wished to produce in my internet web site a thing like that. Can I take element of the publish to my blog? 297085
48550 560630An attention-grabbing discussion is worth comment. I believe which you really should write far more on this matter, it wont be a taboo subject nonetheless usually persons are not sufficient to speak on such topics. To the next. Cheers 590051
112674 904048I consider something truly intriguing about your site so I saved to fav. 277541