ప్రకృతిలో ఇంకే రంగులూ లేవ్.. వైఎస్సార్సీపీకి చెందిన రంగులు మాత్రమే వున్నాయ్.! ఆంధ్రప్రదేశ్లో ముందు ముందు పరిస్థితి ఎలా వుంటుందోగానీ, ప్రస్తుతానికైతే రంగుల పైత్యం అత్యంత హేయంగా మారిందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేశారు.. న్యాయస్థానాల మొట్టికాయలతో మళ్ళీ వాటిని చెరిపేశారు. ‘మంచి మనిషికి ఓ మాట.. మంచి గొడ్డుకి ఓ దెబ్బ..’ అని పెద్దలు చెప్పిన విషయాన్ని పాలకులు పెడచెవిన పెట్టడం అనేది కొత్త విషయం ఏమీ కాదు.
అయినా, ఈ రంగుల్లో ఏముంది.? ఏమోగానీ, ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులకు ఇచ్చే పాఠ్య పుస్తకాలకీ వైసీపీ రంగుల్ని అద్దేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇదెక్కడి చోద్యం.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కానీ, ‘నవ్విపోదురుగాక మనకేటి.?’ అన్నట్టుంది ప్రభుత్వ వైఖరి. రేప్పొద్దున్న ఎవరన్నా న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే, న్యాయస్థాలు మళ్ళీ మొట్టికాయలేస్తే, ‘దులుపుకుపోవడం’ తప్ప, కాస్తో కూస్తో విజ్ఞతతో ఆ తర్వాతైనా వ్యవహరిస్తారనడానికి వీల్లేని పరిస్థితి.
హైకోర్టు మొట్టికాయలేసినా, అక్కడక్కడా ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులేస్తున్న సందర్భాల్ని చూస్తున్నాం. ప్రజలు ఎవరికైనా అధికారమిచ్చేది ఐదేళ్ళు మాత్రమే. అది కూడా అదృష్టం బావుండాలి. లేకపోతే, ఐదేళ్ళలోపే ప్రభుత్వాలు కూలిపోవచ్చు.. అలాంటిది, ఈ రంగులతో ఎవర్ని మాయ చేయాలనుకుంటున్నట్లు.? అన్న విమర్శ రాజకీయ విశ్లేషకుల నుంచి దూసుకొస్తోంది. ప్రజల సొమ్ముతో, పార్టీ రంగుల ప్రచారమా.?
అసలు అధికారంలో వున్నోళ్ళ ఆలోచనలు రాచరిక వ్యవస్థను తలపిస్తున్నాయి తప్ప.. ప్రజాసేవ అన్న భావనే కన్పించడంలేదన్నది ప్రజాస్వామ్యవాదుల వాదన. నిజమే మరి.! తమ పాలన అత్యద్భుతంగా వుండాలని పాలకులు కోరుకుంటే తప్పు లేదు. కానీ, బలవంతంగా తమ పాలన తాలూకు గుర్తుల్ని ప్రజల మీద రుద్దాలనే పైశాచికత్వం మాత్రం సమర్థనీయం కాదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందీ అదే.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్నదీ అదే. పెనం మీంచి పొయ్యిలో పడటమంటే ఇదే మరి.!
175557 353279I genuinely thankful to discover this internet site on bing, just what I was seeking for : D too bookmarked . 885907
577187 742935Sweet internet site , super pattern , extremely clean and utilize friendly . 233820
850782 51046Thanks for the info provided! I was obtaining for this data for a long time, but I wasnt able to discover a reliable source. 530552
391169 112208I gotta bookmark this internet website it seems really helpful invaluable 530062