Switch to English

ఇసుక.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తికమక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఇసుక పేరు చెప్పి రాజకీయ నాయకులు కోట్లు దండుకోవడం కొత్తేమీ కాదు. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే, ఇసుక నుంచి ‘తైలం’ వచ్చేస్తుంటుంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ ‘తైలం’ తీసే కార్యక్రమాన్ని కనుగొన్నారు, దాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. ఇక, చంద్రబాబు హయాంలో ఇసుక కుంభకోణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఏ ఇసుక పేరుతో అయితే అప్పట్లో చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేశారో, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్‌ జగన్‌ అలాంటి విమర్శల్నే ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే, ‘ఇసుక పాపం అంతా ఆ దేవుడిదే’ అంటోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతోంటే, ‘మాకేంటి సంబంధం.?’ అని అధికార పార్టీ నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలు చేస్తోంది.

‘ఇసుకలో అవినీతిని లేకుండా చేయగలిగాం..’ అని తాజాగా అధికారులతో సమీక్ష సందర్భంగా వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించేశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ గురించి సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గుస్సా అయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ – ఎమ్మెల్యే మధ్య ఇసుక వాటాల వ్యవహారం అప్పట్లో పెద్ద రచ్చకు దారి తీసింది. మొత్తం పదమూడు జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతలపై ఇసుక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా, అవినీతికి ఆస్కారమే లేదంటున్నారు వైఎస్‌ జగన్‌.

ఆయన ‘లేదు’ అంటే, అందరూ ‘లేదు’ అనుకోవాలేమో.! కొత్త ఇసుక పాలసీ తీసుకురావడానికి మూడు నెలల సమయం ఇసుక అమ్మకాలకి ఆస్కారం లేకుండా చేసిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌, దొడ్డిదారిన ఇసుక బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలిపోతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించింది.

ఇప్పుడేమో, కొత్త పాలసీ అమల్లోకి వచ్చాక కూడా అదే పరిస్థితి. తప్పులు తమ నెత్తి మీద స్పష్టంగా కన్పిస్తోంటే, అబ్బే.. అదంతా వరదల పాపం అని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చెబుతుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.? పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలిపోతున్న మాట వాస్తవం. ఆ లెక్కన వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రా.? పొరుగు రాష్ట్రాల కోసం ఆయన పనిచేస్తున్నారా.? అన్న విమర్శలకు అధికార పార్టీ ఏం సమాధానం చెబుతుంది.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...