Switch to English

దుగ్గిరాల దుర్మార్గ రాజకీయం: వైసీపీ పాలనలో అంతే మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎంత గొప్పగా గెలిచేసిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇతర పార్టీల అభ్యర్థుల్ని బెదిరించారు.. దాడులు చేశారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాజకీయం చేశారు. ఇంతా చేసినా కొన్ని చోట్ల చుక్కెదురవడంతో అక్కడా నిస్సిగ్గు రాజకీయమే చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దీన్ని గెలుపు.. అనాల్సి వస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల ప్రజాపరిషత్తు ఎన్నికలకు సంబంధించి హైడ్రామా నెలకొంది. వైసీపీకి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యురాలు తాడిబోయిన పద్మావతి కిడ్నాప్‌కి గురయ్యారట. ఈ విషయాన్ని స్వయానా ఆమె తనయుడు వెల్లడించడం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరులే తన తల్లిని కిడ్నాప్ చేశారన్నది పద్మావతి తనయుడి ఆరోపణ.

తాడిబోయిన పద్మావతి ఎంపీపీ పదవికి పోటీ చేయాలనుకుంటున్నారట. కానీ, అందుకు వైసీపీ అధినాయకత్వం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో ఆమె విపక్షాల మద్దతు తీసుకుంటారేమో అన్న అనుమానం వైసీపీ పెద్దల్లో పెరిగినట్లు తెలుస్తోంది.

మరోపక్క, మెజార్టీ సభ్యులు టీడీపీకి వున్నా, బీసీ రిజర్వుడు స్థానమైన దుగ్గిరాల ఎంపీపీ పదవిని పొందేందుకు సాంకేతిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ. చిత్రమేంటంటే, జనసేన పార్టీకి వున్న ఓ సభ్యురాలు కూడా టీడీపీ వైపుకు వెళ్ళడం.

ఎలా చూసినా, సంఖ్యాబలం పరంగా టీడీపీ ముందంజలో వుందిగానీ, బీసీ సభ్యురాలు ఆ పార్టీకి లేకపోవడంతో, స్వతంత్రంగా పోటీ చేస్తే పద్మావతికి మద్దతిస్తామంటోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే పద్మావతిని వైసీపీ కిడ్నాప్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏలూరు జిల్లాలో ఇటీవల వైసీపీకి చెందిన గ్రామ స్థాయి నాయకుడ్ని వైసీపీలోని వైరి వర్గమే చంపేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీలో దుర్మార్గ రాజకీయం ఇలా తయారైంది మరి. ఇంతకీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది.? అంటే, అదంతే.! విపక్షాల మీద కేసులు పెట్టడానికి తప్ప, అధికార పార్టీ అరాచకాల్ని పోలీసు వ్యవస్థ పట్టించుకోవడంలేదన్నది టీడీపీ సహా ఇతర విపక్షాల ఆరోపణ.

3 COMMENTS

  1. 394558 259541Today, I went to the beach front with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is totally off topic but I had to tell someone! 647256

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...