Switch to English

దమ్ము.. ధైర్యం.. మట్టి మశానం.! ఇదేం రాజకీయం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో దమ్ము, ధైర్యం.. ఇలాంటివాటికి అసలు విలువ వుందా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుర్తిస్తున్నారా.? లేదంటే, ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే వున్నట్లు భావిస్తున్నారా.? అసలు తాను రాజకీయ నాయకుడినేనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్ముతున్నారా.? లేదా.?

చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.! తెనాలిలో ఓ బహిరంగ సభ జరిగింది. రైతుల ఖాతాల్లో డబ్బులేసే కార్యక్రమం. దీనికి, బహిరంగ సభ ఎందుకు.? ‘30 కోట్లు వేశారు, 15 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేశారు’ అన్న ఆరోపణలొస్తున్నాయ్ ఈ కార్యక్రమం గురించి. పత్రికల్లో ప్రకటనలు, జనాన్ని తోలుకొచ్చిన వైనం.. సభ ఏర్పాట్లు.. ఇవన్నీ చూస్తే, ఖర్చు గట్టిగానే అయి వుండొచ్చు.

ముఖ్యమంత్రి కదా.? ప్రజాధనం వృధా అవుతోంటే, ఆయన ఈ ఖర్చునెలా సమర్థించారట.? పోనీ, అధికారిక కార్యక్రమం కదా.? అక్కడ, ప్రజలకు తాము ఏం చేస్తున్నామో చెప్పి ఊరుకోవచ్చు. కానీ, రాజకీయాలు మాట్లాడారు. మాట్లాడితే మాట్లాడారు.. మధ్యలో ‘దమ్ము, ధైర్యం’ గోలేంటి.?

దమ్ము ధైర్యం వుంటే.. రూపాయి కూడా ఖర్చు చేయకుండా జనాన్ని రప్పించగలగాలి. దమ్ము ధైర్యం వుంటే, ప్రజా ధనం వృధా చేయకుండా ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అన్నిటికీ మించి, దమ్ము.. ధైర్యం.. ఈ రెండూ వుంటే.. రోడ్డు మార్గాన.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా.. తాడేపల్లి నివాసం నుంచి తెనాలి బహిరంగ సభ వరకూ వెళ్ళాలి.

ఎన్నికల్లో ఎవరు ఎలా పోటీ చేయాలన్నది, విపక్షాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా నిర్దేశించగలుగుతారు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం వుంటే.. ఒక్క ‘పోలీస్ కేసు’ కూడా లేని నాయకుల్ని ఎన్నికల బరిలో నిలబెట్టాలి. దాన్ని కదా, దమ్మూ.. ధైర్యం అంటారు.!

నెటిజన్లు ఇలా కడిగి పారేస్తున్నారు సోషల్ మీడియాలో.! అంతేనా, నీ మీద కోడి కత్తితో దాడి చేయించిందెవరో చెప్పు.. నీ బాబాయ్‌ని గొడ్డలితో నరికి చంపితే, గుండె పోటుగా ఎందుకు చిత్రీకరించారో చెప్పు.. ఇలా ప్రశ్నలు పోటెత్తుతున్నాయ్.! వీటిల్లో ఒక్కదానికైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర సమాధానముందా.?

సీపీఎస్ ఎప్పుడు రద్దవుతుంది.? మద్య నిషేధం ఎప్పుడు అమలవుతుంది.? అది అమలు చేయకుండా, ఎన్నికల్లోకి వెళ్ళబోమని గతంలో చెప్పారు కదా.. ఆ మాట మీద నిలబడే దమ్ము ధైర్యముందా.? బాబోయ్.. ఇన్ని ప్రశ్నలా.? వందల్లో కాదు, వేలల్లో.. లక్షల్లో ప్రశ్నలొస్తున్నాయ్ మరి.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...