Switch to English

వావ్.. నిధుల్లేకుండానే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘శరవేగంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు సంకల్పించిన వైఎస్ జగన్ ప్రభుత్వం. జాతీయ ప్రాజెక్టు గనుక, కేంద్రమే పూర్తిస్థాయి నిధులు ఇవ్వాల్సి వున్నా.. రాష్ట్ర అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది.. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి తీరుతుంది..’ అంటూ బులుగు ప్రచారం బీభత్సంగా జరుగుతోంది.

స్పిల్ వే ఛానల్ పూర్తి చేయడానికి సంబంధించి, కఫర్ డ్యామ్ వ్యవహారాలకు సంబంధించి, జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి.. రకరకాల ‘వివరాలతో’ అధికార వైసీపీ అనుకూల.. అధికారిక మీడియాలో పేద్ధ కథనం ప్రచురితమైంది. పునరావాసం విషయంలోనూ అస్సలేమాత్రం అలసత్వం లేదట. భేష్.! ఇలాగైతే, పోలవరం ప్రాజెక్టు విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముంపు బాధితులతో సహా. 2022 నాటికే ప్రాజెక్టు పూర్తయిపోతుందట. అదే గనక జరిగితే, అంతకన్నా కావాల్సిందేముంది.?

ఎప్పుడో బ్రిటిష్ హయాంలో ఈ ప్రాజెక్టు ఆలోచన తెరపైకొచ్చింది. స్వాతంత్ర్యం దేశానికైతే వచ్చిందిగానీ, పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమవడానికి చాలా దశాబ్దాలే పట్టింది. ప్రాజెక్టు పనులు ప్రారంభమయి పూర్తవడానికీ.. దశాబ్దాల సమయం పడుతోంది. అంతా బాగానే వుందిగానీ, కేంద్రం నుంచి నిధులు రాకుండా పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా పూర్తవుతాయబ్బా.? ఇదే అసలు సిసలు ప్రశ్న. కేంద్రం, పోలవరం ప్రాజెక్టుకి సహకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్ని కేంద్రం రీ-ఎంబర్స్ చేయడంలేదని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి కొన్నాళ్ళ క్రితం సెలవిచ్చారు. మరెలా పోలవరం ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుంది.? ముంపు బాధితులేమో.. తమకు ప్రభుత్వం పునరావాసం కల్పించలేదంటూ కంటతడిపెడుతున్నారు.

గోదావరికి వరదొస్తే చాలు.. ముంపు బాధితులు నరకాన్ని చూస్తున్నారు. పునరావాసం కోసం ఏర్పాటు చేసిన కాలనీల్లో మౌళిక సౌకర్యాల్లేవు.. అక్కడ ప్రజలు నివసించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. చెప్పే మాటలకీ, చేసుకుంటున్న ప్రచారానికీ అస్సలేమాత్రం పొంతన లేకపోవడం అనేది చంద్రబాబు హయాంలో చూశాం. అంతకు మించిన పబ్లిసిటీ పైత్యం ఇప్పుడు చూస్తున్నాం. మొన్న పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినట్లుగా.. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ‘మమ’ అనిపించేస్తారేమోనన్న భయాలు రాష్ట్ర ప్రజలకు కలగడంలో వింతేమీ లేదు. ఎందుకంటే, పబ్లిసిటీ ఆ స్థాయిలో జరుగుతోంది.. పనులు కూడా అదే స్థాయిలో ‘వీక్’గా వుంటాయ్ కదా మరి.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...