Switch to English

హుజూర్ నగర్ లో కేసీఆర్ కు జగన్ సాయం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా పలు పనులు చక్కబెట్టుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ జగన్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారా? ఆ విధంగా చర్యలు చేపట్టారా? అంటే ఔననే అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టీ నెలకొంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నిక కావడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచిన హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి పరువు ప్రతిష్టలతో కూడుకున్నవి కావడంతో వాటిపై గట్టిగానే దృష్టి పెడతారు. పైగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. మరోవైపు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానం కాంగ్రెస్ కంచుకోట అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోది కావడంతో ఎలాగైనా అక్కడ గులాబీ జెండా ఎగరవేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని విధాలుగా సమాయత్తమయ్యారు. అక్కడి ఇన్ చార్జిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించగా.. ఆయన క్షేత్రస్థాయికి వెళ్లిపోయి అప్పుడే పనులు ప్రారంభించేశారు.

మరోవైపు కేటీఆర్ కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. ఇక గులాబీ దళపతి సైతం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ తో భేటీ అయినప్పుడు కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. హుజూర్ నగర్ లో వైఎస్సార్ సీపీకి కూడా బాగానే అభిమానులు ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేయకపోవడంతో వారు తమకు నచ్చిన పార్టీకి ఓటేశారు. వారిలో చాలామంది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో వారి ఓట్లను కొల్లగొట్టడానికి కేసీఆర్ పావులు కదిపారు.

మీ ఓటుబ్యాంకును మాకు మళ్లించడంటూ జగన్ ను అభ్యర్థించినట్టు సమాచారం. ఈ విషయంపై జగన్ ఏం హామీ ఇచ్చారో తెలియకున్నా.. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ సైన్యం వ్యూహాలు రూపొందిస్తోంది. వైఎస్సార్ సీపీ నేతలుగా పేరున్నవారితో మాట్లాడి ఆ మేరకు వారిని ఒప్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....