Switch to English

‘పాపం’ ఎల్జీ పాలిమర్స్‌దే.. జగన్‌ సర్కార్‌ ‘న్యాయం’ చేస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

విశాఖపట్నం నగరంలో కొద్ది రోజుల క్రితం చోటుచేసుకున్న పెను దుర్ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అదే ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో విషవాయువు లీకేజ్‌. ఆ ఘటనలో 12 మంది చనిపోయారు. ఈ లెక్క 15 దాటిందని విపక్షాలు అంటున్నాయి. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ప్రకటించింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. తాజాగా ఈ ఘటనకు సంబంధించి హై పవర్‌ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది. నివేదికలో, ప్లాంట్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తేలింది.

మరిప్పుడు, ప్రభుత్వం ఏం చేయబోతోంది.? నిజానికి, ఈ తరహా ప్రమాదాల్ని అత్యంత ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సి వుంటుంది. విషవాయువు ప్రభావం అక్కడ ఎన్నేళ్ళు వుంటుంది.? అన్నదానిపై పరిశోధనలు జరగాలి. ఆ దిశగా అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రభుత్వం చెబుతున్నా, స్థానికుల్లో మాత్రం ఆందోళన తొలగడంలేదు. ప్రమాదం జరిగాక, ముఖ్యమంత్రి హుటాహుటిన విశాఖపట్నం వెళ్ళారుగానీ, తొలుత బాధితుల్ని కలవకుండా.. ముందుగా పరిశ్రమకు సంబంధించినవారితో మంతనాలు జరిపారంటూ విపక్షాలు విమర్శలు చేసిన విషయం విదితమే.

మరోపక్క, పరిశ్రమలో ప్రమాదానికి కారణమైన ‘రసాయనం’ విదేశాలకు తరలిపోవడంపైనా ఆరోపణలు వున్నాయి. కాగా, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, ఎల్జీ పాలిమర్స్‌ సంస్థకు తక్షణ జరీమానా కింద 50 కోట్లు చెల్లించాలని ఆదేశించడం తెల్సిన విషయమే. ఇప్పుడు హై పవర్‌ కమిటీ నివేదిక వచ్చింది గనుక, సంస్థపై ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా వుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్లాంట్‌ని అక్కడి నుంచి వేరే చోటకి తరలించే అవకాశాలు వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఈ దిశగా సమాలోచనలు చేస్తోందన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం.

స్థానిక ప్రజానీకం కూడా పరిశ్రమ అక్కడ వుండకూడదనే కోరుతోంది. ప్లాంట్‌ ఎక్కడికి వెళుతుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, 12 మంది మృతికి, ఆ ప్రాంతం కలుషితం కావడానికీ కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. భారీ జరీమానాలు విధించి, అందులోంచి మరింత పరిహారాన్ని బాధితులకు అందించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

ఎల్జీ పాలిమర్స్‌ అనే కాదు, ఆ తర్వాత విశాఖలో సాయినార్స్‌ అనే సంస్థలో ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాలోనూ ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తరహా ప్రమాదాలు ఇకపై జరగకూడదంటే నిబంధనలు మరింత ఖచ్చితత్వంతో అమలు చేయాల్సి వుంటుంది. ‘ఇంకో ప్రమాదం జరగనివ్వబోం’ అనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదనే వుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....