నిండు గర్భిణితో ఉన్న అక్కకు సాయం చేయడానికి వచ్చిన ఆమె 15 ఏళ్ల చెల్లికపై కన్నేశాడు. సమయం చేసి ఆమెపై అఘాయిత్యం చేశాడు. విషయం తెలుసుకున్న భార్య కోపంతో రగిలిపోయింది. భర్త అని కూడా చూడకుండా అతడిని నరికేసింది. తర్వాత భర్త మృతదేహాన్ని ఇంటి వెనుక పెరటిలో పాతిపెట్టేసింది. ఆ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
శిఖర్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో 28 ఏళ్ల వివాహిత తన భర్త, ఐదేళ్ల కుమారుడితో నివసిస్తోంది. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణిగా ఉండటంతో ఇంటి పనుల్లో సాయం చేసేందుకు 9వ తరగతి చదువుతున్న తన చెల్లెలిని తీసుకొచ్చింది. అయితే, ఆమెపై కన్నేసిన భర్త జూన్ ఒకటో తేదీ రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. జూన్ 2వ తేదీ రాత్రి నిద్రిస్తున్న భర్తపై గొడ్డలితో దాడి చేసి హతమార్చింది. అనంతరం అతడి మృతదేహాన్ని ఇంటి వెనుక గొయ్యి తీసి పాతిపెట్టింది. తర్వాత పోలీసు స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయింది.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె చెల్లెలిని వైద్య పరీక్షల కోసం పంపించారు. కాగా, ఈ హత్య విషయంలో మరో కథనం కూడా వినిపిస్తోంది. తనపై అత్యాచారానికి ప్రయత్నించిన బావపై బాధితురాలే దాడి చేసి చంపేసిందని ప్రచారం జరుగుతోంది. కానీ పోలీసులకు మాత్రం తన భర్తను హత్యచేసింది తానేనని అతడి భార్య స్పష్టంచేసింది. దీంతో పోలీసులు ఆ మేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
900330 469959My spouse and I stumbled over here from a different web site and thought I might as effectively check points out. I like what I see so now im following you. Appear forward to going over your internet page repeatedly. 640311
597669 244161Some genuinely quality weblog posts on this website, saved to fav. 292034
410708 906914Your talent is really appreciated!! Thank you. You saved me a great deal of frustration. I switched from Joomla to Drupal towards the WordPress platform and Ive fully embraced WordPress. Its so a lot easier and easier to tweak. Anyway, thanks again. Awesome domain! 821412