Switch to English

హోదాపై వైసీపీకి నోరు పెగలట్లేదెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి ఏ మాత్రం సంబంధం లేని విషయమిది..’ అంటూ చాలాకాలంగా జీవీఎల్‌ నరసింహారావు తదితర బీజేపీ నేతలు చెబుతూనే వున్నారు. ఇదే విషయాన్ని తాజాగా కేంద్రం, హైకోర్టుకి అఫిడవిట్‌ రూపంలో తెలిపింది కూడా. అయితే, ఈ అఫిడవిట్‌.. 2018లో, అంటే చంద్రబాబు హయాంలో దాఖలైన పిటిషన్‌కి సంబంధించినది కాడం గమనార్హం. దాన్ని పట్టుకుని వైసీపీ నేతలు చేస్తోన్న యాగీ అంతా ఇంతా కాదు.

‘చంద్రబాబు అండ్‌ కో ఈ దెబ్బతో ఔట్‌.. కేంద్రం తేల్చి చెప్పేసింది, రాష్ట్ర రాజధాని వ్యవహారాల్లో మాకు సంబంధం లేదని..’ అంటూ వైసీపీ నేతలు హడావిడి చేసేస్తున్నారు. అంతా బాగానే వుందిగానీ.. అదే అఫిడవిట్‌లో ప్రత్యేక హోదా సహా పలు అంశాల ప్రస్తావన వుంది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా.. వంటి అంశాలున్నాయి. మరి, వీటిపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఎందుకు నోరు పెగలట్లేదు.?

‘మేం అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని ఇదే వైసీపీ, రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. మరి, మెడలు వంచారా.? అంత సీన్‌ వైసీపీకి లేదు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గడచిన ఏడాది కాలంలో పలు సందర్భాల్లో పరోక్షంగా సెలవిచ్చారు. ‘కేంద్రంలోని బీజేపీకి పూర్తి బలం వున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో ఎంత ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేదు..’ అని వైఎస్‌ జగన్‌ చేతులెత్తేశారు. ఇదీ, రాష్ట్రంపై వైసీపీ చిత్తశుద్ధి.

రాష్ట్రానికి మూడు కాకపోతే, ముప్పయ్‌ రాజధానులు కట్టుకోవచ్చు. కానీ, అసలంటూ తొలుత ఓ రాజధానిని అభివృద్ధి చేయాలి కదా.! చంద్రబాబు చెప్పిన లక్ష కోట్ల రాజధాని కాకపోయినా.. కనీసం ఓ పాతిక వేల కోట్ల రాజధానిని అయినా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్మించి తీరాలి. అది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు. ఆ తర్వాత, మరో రెండు రాజధానుల్ని టేకప్‌ చేయొచ్చు.. ఆ రెండూ పూర్తయ్యాక, ప్రభుత్వానికి మరిన్ని రాజధానుల్ని నిర్మించే ఆలోచన వచ్చినా తప్పుపట్టలేం.

ఒక్క రాజధాని అమరావతిని స్మశానంగా అభివర్ణిస్తూ, దాన్నే శాసన రాజధాని.. అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, ఇంకోపక్క విశాఖ, కర్నూలు నగరాల్ని రాజధానులుగా ప్రకటించడం ఏ నైతిక విలువలకు నిదర్శనం.? అధికారంలో వుంటే, అడ్డగోలుగా రాజధానులు ఏర్పాటు చేసెయ్యొచ్చా.? ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారిపోతాయా.? ఈ విషయమై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిందే. ఓ రాష్ట్రంలో రాజధాని పేరుతో ఇంత రచ్చ జురుగుతోంటే, కేంద్రం పట్టించుకోకపోవడాన్ని బాధ్యతారాహిత్యమని కాక ఇంకేమనాలి.? రాష్ట్రమిలా అడ్డగోలు రాజకీయాలతో సర్వనాశనమైపోతోంటే, ఈ సందట్లో హోదా వాదన వీగిపోతుందని బహుశా బీజేపీ పెద్దలు భావిస్తున్నారేమో.!

1 COMMENT

  1. 211834 74243Right after study some of the websites along with your internet internet site now, i truly as if your way of blogging. I bookmarked it to my bookmark website list and will likely be checking back soon. Pls appear at my website likewise and figure out what you believe. 529801

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...