తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అవుతున్నారనగానే, సవాలక్ష ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించే ప్రణాళికపై ముఖ్యమంత్రుల సమావేశం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.
అయితే, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయకుండా, కేసీఆర్ చుట్టూ జగన్ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. పోలవరం ప్రాజెక్టు దండగ.. అన్నది కేసీఆర్ అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన జగన్, కేసీఆర్‌కి ‘జీ హుజూర్’ అంటున్నారు ఈ విషయంలో. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే విషయమై ఏపీ సీఎం జగన్‌ని తాను ఒప్పించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించుకున్నారు. అంటే, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన విషయాలపై కేసీఆర్ పెత్తనం సుస్పష్టం అన్న మాట. ‘పోలవరం ప్రాజెక్టుని వ్యతిరేకించినం.. వ్యతిరేకిస్తూనే వుంటాం..’ అని కేసీఆర్ పలుమార్లు కుండబద్దలుగొట్టేసినా, కేసీఆర్‌తో జగన్ ఎందుకు ‘సఖ్యత’ కోసం ఆరాటపడుతున్నారో అర్థం కావడంలేదు ఎవరికీ.
మరోపక్క, కేసీఆర్‌తో జగన్ భేటీ వెనుక ఇంకో కారణం కూడా వుందంటూ ఓ గాసిప్ తెరపైకొచ్చింది. అదే హుజూర్ నగర్ ఉప ఎన్నిక. ఇక్కడ టీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో గెలవడంతో, హుజూర్ నగర్‌కి ఉప ఎన్నిక వచ్చింది. ఈసారి స్వయానా ఆయన సతీమణి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. దాంతో, ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున సహకారం కోసం కేసీఆర్, జగన్‌ని పిలిపించుకున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.
గతంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఏపీ పోలీసుల్ని కాంగ్రెస్ వాడుకుందని టీఆర్ఎస్ ఎలాగైతే ఆరోపిస్తోందో, ఇప్పుడు ఏపీ పోలీసుల్ని హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోసం వాడుకునేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని భేటీకి పిలిపించుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అది నిజమేనా.? కేసీఆర్ ఏం చెప్పినా వైఎస్ జగన్ మరో మాట లేకుండా ‘జీ హుజూర్’ అనాల్సిందేనా.? గత కొన్నాళ్ళుగా పూర్తిగా మౌనం దాల్చిన వైఎస్ జగన్, ఈ ఆరోపణలపైన అయినా స్పందిస్తారా.? వేచి చూడాల్సిందే.
944806 162031I do not have a bank account how can I location the order? 377409
188740 408787Just wanna input on few common points, The internet site design is perfect, the articles is very fantastic : D. 16318
91215 414010I believe other site owners need to take this site as an example , quite clean and great user genial style . 825456