Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: అమరావతి ‘తరలింపు’పై అంత తొందరేల.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ దెబ్బకి ఓ మనిషి స్వేచ్ఛగా ఓ చోట నుంచి ఇంకో చోటకి కదల్లేని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాట్లు లభిస్తున్నా.. జన జీవనం ఇప్పట్లో ఇదిరకటి సాధారణ స్థాయికి చేరుకునేలా కన్పించడంలేదు. ధైర్యంగా జనం ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు. కొందరు బాధ్యతారాహిత్యంగా రోడ్లెక్కుతున్నారనుకోండి.. అది వేరే విషయం. మరి, బాధ్యతగల ప్రభుత్వం ఏం చేయాలి.? సందట్లో సడేమియా.. అన్నట్టు ‘వికేంద్రీకరణ’ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు దిశగా పరుగులు పెడుతోంది.

వున్నపళంగా ఇప్పుడు రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరం ఏమొచ్చింది.? అంటే, దానికి ‘అభివృద్ధి’ అనే ‘సాకు’ చూపిస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఆ హక్కు ప్రభుత్వానికి వుంటుంది. కానీ, సమయం.. సందర్భం వుండాలి కదా.! చట్ట సభల్లో బిల్లు పెట్టి, పాస్‌ అయ్యిందనిపించుకుని.. శాసన మండలిలో రగడని లైట్‌ తీసుకుని.. గవర్నర్‌ ఆమోద ముద్రతో చట్టంగా మలచేసినా.. న్యాయస్థానాల్లో షాక్‌ తప్పలేదు.

దేశంలో మహారాష్ట్ర తర్వాత రోజువారీ అత్యధిక కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదవుతున్నాయి. ఈ లెక్కన, ఆంధ్రప్రదేశ్‌ ఎంత జాగ్రత్తగా వుండాలి.? కానీ, ఆ ‘బాధ్యత’ ప్రభుత్వ పెద్దల్లో వున్నట్లు కనిపించడంలేదు. అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌నీ, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌నీ వేరు చేసెయ్యాలన్నది ప్రభుత్వ సంకల్పం. ‘మేం, అమరావతి స్థాయిని తగ్గించాలనుకోవడంలేదు.. అమరావతి అభివృద్ధిపై మాకు చిత్తశుద్ధి వుంది’ అని చెబుతూ, అమరావతి నుంచి.. కీలకమైన ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌నీ, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌నీ తరలించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

పైగా, ఇప్పటికిప్పుడు విశాఖలో అవసరమైన సౌకర్యాలున్నాయా.? అంటే అదీ లేదు. కర్నూలు పరిస్థితి కూడా అంతే. హైకోర్టును కర్నూలులో ఇప్పటికిప్పుడు కట్టేయడం సాధ్యం కాదు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కూడా అంతే. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘దూకుడు’ ప్రదర్శించాలనుకుంటున్నారు.. ఈ క్రమంలో హైకోర్టు మొట్టికాయలతో ప్రభుత్వం పదే పదే బొక్కబోర్లా పడాల్సి వస్తోంది.

తొలుత అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంలా కాకపోయినా, ఓ మోస్తరు నగరంగా అభివృద్ధి చేసి చూపించి, ఆ తర్వాత ఆ మోడల్‌తో ఇంకో రెండు నగరాల్ని అభివృద్ధి చేస్తామంటూ వాటికి ‘రాజధాని మోడల్‌’ పేరు పెడితే.. దీన్ని ఎవరూ వ్యతిరేకించే పరిస్థితి వుండదు. మూడేంటి ఖర్మ.? ముప్ఫయ్‌ మూడు నగరాల్ని నిర్మిస్తామంటే ఎవరైనా అడ్డుకుంటారా.? ఈ చిన్న లాజిక్‌ ప్రభుత్వ పెద్దలు ఎందుకు విస్మరిస్తున్నారో.. అసలు సలహాదారు అనే వ్యవస్థ ఎందుకు సరైన రీతిలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వలేకపోతోందో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...