Switch to English

నర్సాపురం పార్లమెంట్ – గెలుపెవరిది ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి నర్సాపురం లోక్ సభ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా, విలక్షణంగా మారింది. ఈ పార్లమెంట్ సీటు ఇప్పటివరకూ ‘రాజుల’ కంచుకోటగా పేరుంది ఇక్కడ క్షత్రియ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల క్షత్రియ అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలుపొందడం ఇక్కడ ఆనవాయితీ. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓట్ల సంఖ్య 14,38,813. ఇందులో పురుష ఓటర్లు 7,08,156 కాగా, స్త్రీ ఓటర్లు 7,30,156. మిగతా ఇతరులు వున్నారు. 1999 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సినీనటుడు కృష్ణంరాజు 165000 పైగా ఓట్ల మెజారిటీ తోనూ, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కనుమూరి బాపిరాజు సుమారు 114000 ఓట్ల పైగా మెజారిటీ తోనూ గెలిచారు.

2014 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ సీటును తెలుగుదేశం, బీజేపీ అలయన్స్ లో భాగంగా బీజేపీకి కేటాయించారు. అప్పుడున్న సమీకరణాలు, పవన్ కళ్యాణ్ ప్రచారం, మోడీ హవా తదితర కారణాల వల్ల అప్పటి బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు కూడా సునాయాసంగా మంచి మెజారిటీతో గెలుపొందారు. తద్వారా ఇక్కడ క్షత్రియ సామాజిక అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ జనసేన పార్టీ రావటంతో సీన్ రివర్స్ అయ్యేట్లుగా కనిపిస్తోంది.

క్షత్రియ నాయకుల ప్రాబల్యం బాగావున్న ఈ నియోజకవర్గంలో తాజాగా జనసేన అభ్యర్థిగా పవన్ సోదరుడు నాగబాబును పోటీకి నిలబెట్టడం వల్ల ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత సంతరించుకుని గెలుపు సమీకరణాలు మారేలా కనిపిస్తోంది. మిగతా ప్రధాన ప్రత్యర్థులైన తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా గట్టి క్షత్రియ నాయకులు ఇక్కడ పోటీ పడుతున్నారు.

గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గోకరాజు గంగరాజు ఈసారి పోటీకి ఆసక్తి చూపకపోవటంతో ఈసారి బీజేపీ ఆ సీటును మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కేటాయించింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంగా ఇప్పుడు బీజేపీ ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదని చెప్పవచ్చు. అయితే కాపు సామాజికవర్గానికే చెందిన మాణిక్యాలరావుకు.. జనసేన పార్టీ బరిలో వున్న కారణంగా ఆ సామాజిక వర్గ ఓట్లు ఎంతమాత్రం వస్తాయనేది కూడా అనుమానాస్పదమే. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజును బరిలో నిలిపింది. అయితే నాయకుడిగా ఈయనకు మంచి పేరున్నా, పార్టీ ప్రాబల్యం రాష్ట్రంలో అంతగా లేకపోవటం మైనస్ గా కనిపిస్తోంది.

ఇక అనూహ్య పరిణామాల మధ్య ఇటీవలవరకు తెలుగుదేశం అభ్యర్థిగా భావించిన పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు వైసీపీలోకి వలస రావటంతో, ఈయనను వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించి తెలుగుదేశానికి సవాల్ విసిరింది. ఈ హఠాత్ పరిణామంతో గుక్క తిప్పుకున్న తెలుగుదేశం ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా అనుకున్న వేటుకూరి శివరామరాజును.. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఇద్దరు బలమైన క్షత్రియ నాయకులు కావటంవల్ల ఇక్కడ క్షత్రియ ఓట్లు ఇద్దరికీ చీలే అవకాశం వుంది. ఇతర సామాజికవర్గాల ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారికి గెలుపు అవకాశం ఉంటుంది.

కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వున్న ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లె గూడెం.. ఈ 7 అసెంబ్లీ సీట్ల పరిధిలో కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువే. అందుకే కాపుల ఓట్లు, క్షత్రియేతర ఓట్లు ఎక్కువ ఎవరికి పడతాయనే దాని పై అభ్యర్థి గెలుపు ఆధారపడి వుంది. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గం, సినిమా రంగ సెలబ్రిటీ, పవన్ సోదరుడైన నాగబాబును ఇక్కడ పోటీలోకి నిలపడంతో జనసేన ఇక్కడ గట్టి పోటీ ఇచ్చి గెలుపును సొంతం చేసుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు.

అందునా పవన్ భీమవరం అసెంబ్లీకి పోటీచేస్తూ తన సోదరుడి గెలుపును కూడా కొంత భుజాన వేసుకున్నట్లు కనపడుతోంది. అయితే కాపుల ఓట్లు అన్ని నాగబాబుకు పడితేనే ఇది సాధ్యమవుతుంది. క్షత్రియ ఓట్లు వైసీపీ, టీడీపీ పార్టీలు చీల్చుకుంటున్న నేపథ్యంలో ప్రధాన ప్రాబల్యం వున్న కాపు సామాజికవర్గ ఓట్లన్నీ జనసేన సొంతం చేసుకుంటే… ఈ సారి రాజులకోటలో ఇతర సామాజికవర్గం పాగా వేసినట్లు అవుతుంది. ఇక్కడ కాపు సామాజికవర్గంలో ఈసారి తమ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకొని ఒక మార్పు తీసుకురావాలనే చైతన్యం వచ్చినట్లు తెలుస్తోంది.

కానీ తెలుగుదేశం, వైసీపీలలో కూడా కాపు సామాజికవర్గ నాయకులు, అభిమానులు ఎక్కువ సంఖ్య లోనే ఉండటం ఇక్కడ గమనార్హం. అదీ కాక తెలుగుదేశం తాము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు తమ అభ్యర్థిని గట్టెక్కిస్తాయని గట్టిగా నమ్ముతోంది. అదే విధంగా వైసీపీ అభ్యర్థి రఘురామ్ కృష్ణంరాజుకు కూడా క్షత్రియ వర్గాల్లో మంచి పట్టు, ఫాలోయింగ్ ఉండటమే కాకుండా.. అందరికి అందుబాటులో వుంటారనే పేరుంది. ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొని వున్న నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో రాజులకోట పై గెలుపు ఎవరిది కానున్నదో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...