సినిమా రంగంలో మీ టూ వ్యహారాలు అన్ని ఇన్ని కావు .. ఒక్కో హీరోయిన్ ది ఒక్కో కథ. ఇవన్నీ చూస్తూనే .. పరిశ్రమలో మీ టూ వ్యవహారం ఎంత రేంజ్ లో ఉందన్నది అందరికి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ మీ టూ వ్యవహారం పై ఘాటుగానే స్పందించారు .. అదికూడా బాహాటంగా !! తాజాగా మరో హీరోయిన్ తనకు జరిగిన ఓ సంఘటన చెబుతూ అందరికి షాక్ ఇచ్చింది? ఏకంగా తన దర్శకుడే ఆ హీరోయిన్ తో ఇద్దరం లిప్ లాక్ ప్రాక్టీస్ చేద్దామని అడిగాడట? హీరోయిన్ ని లిప్ లాక్ అడిగిన దర్శకుడు ఎవరు ? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? అంటే ..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన వీర్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ జరీన్ ఖాన్ గుర్తుందిగా. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించింది. కానీ తన కెరీర్ కు అవసరమైన హిట్ మాత్రం అందుకోలేదు. ఆ తరువాత హేట్ స్టోరీ 3 తో ఒక్కసారిగా హీటెక్కించి సంచలనం రేపింది. హౌస్ ఫుల్ 2 లో కూడా నటించిన జరీన్ ఖాన్ కెరీర్ మొదట్లో తనకు ఎదురైనా ఈ చేదు అనుభవాన్ని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో పంచుకుంది.
Also Read: రమ్య సాంగ్ లో హీటెక్కిస్తానంటున్న రకుల్ ?
ఈ సందర్బంగా జరీన్ ఖాన్ మాట్లాడుతూ .. కెరీర్ మొదట్లో ఓ ప్రముఖ దర్శకుడు నన్ను లిప్ లాక్ ప్రాక్టీస్ చేద్దామని ప్రపోజ్ చేసాడట !! అప్పటికి నేను పరిశ్రమకు కొత్త .. అయినా సరే ఆ దర్శకుడు ఇచ్చిన అఫర్ ని తిరస్కరించానని చెప్పింది ఆ హీరోయిన్. అంతే కాదు మరో ఘాటు బాంబు పేల్చింది .. పరిశ్రమలో కొంత మందితో స్నేహానికి మించి చనువుగా ఉంటె సినిమాల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటావని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడని చెప్పింది. అయినా ఎవరెన్ని చెప్పిన తాను మాత్రం ఎవరి మాయలో పడలేదని ఆ అమ్మడు చెప్పింది. ప్రస్తుతం జరీన్ చెప్పిన కామెంట్స్ బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి .. జరీన్ ని లిప్ లాక్ అడిగిన దర్శకుడు ఎవరా ? అని !!
