Switch to English

అమరావతి ఎక్కడ.. కొత్త మ్యాప్ లో కనిపించదే?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే అందరికీ చిన్నచూపే. ఆది నుంచి అమరావతి భ్రమరావతిలాగే మారిపోయింది. విభజన తర్వాత ఏపీకి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినా.. ఎవరికీ పట్టని అనాథగా మిగిలిపోయింది. చివరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన భారత మ్యాప్ లో సైతం అమరావతి కనిపించడంలేదు. అంటే, కేంద్రం దృష్టిలో సైతం అమరావతి లేనట్టే అని అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు తర్జనభర్జనల అనంతరం విజయవాడ, గుంటూరు మధ్య మంగళగిరి పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ ప్రాంతానికి అమరావతిగా నామకరణం చేశారు. ఎంతో అట్టహాసంగా శంకుస్థాపన సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లిపోయారు.

మరోవైపు రాజధాని నిర్మాణం కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 33వేల ఎకరాలను సేకరించింది. దీనిని అప్పటి విపక్షం వైఎస్సార్ సీపీ గట్టిగా వ్యతిరేకించింది. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ టీడీపీపై ఆరోపణలు గుప్పించింది. అంతేకాకుండా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని విమర్శలు చేసింది. ఈ క్రమంలో అమరావతి నిర్మాణం నత్తనడకన సాగింది.

టీడీపీ పాలన ముగిసి, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అమరావతే పడకేసింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. రాజధానిని మార్చబోమంటూనే పరిపాలనా వికేంద్రీకరణ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఏపీ రాజధాని అమరావతా.. కాదా? అసలు రాజధాని నిర్మాణం జరుగుతోందా? దానిని ఎక్కడికైనా మార్చేస్తున్నారా వంటి అనుమానాలు తీవ్రమయ్యాయి.

ఇదే సమయంలో కేంద్రం జమ్మూకాశ్మీర్ కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. కాశ్మీర్ ను రెండు ముక్కలుగా విభజించింది. జమ్మూకాశ్మీర్, లడాఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. దీంతో ఇప్పటివరకు దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు 28 అయ్యాయి. 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కాస్తా 9 అయ్యాయి. ఈ నేపథ్యంలో భారతదేశ కొత్త పొలిటికల్ మ్యాప్ ను కేంద్రం తాజాగా విడుదల చేసింది.

అందులో ప్రతి రాష్ట్రం పేరును దాని రాజధాని ప్రాంతంతో సహా పేర్కొంది. అయితే, ఏపీ విషయానికి వచ్చేసరికి రాజధాని పేరు ప్రచురించలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే చూపించారు. అంటే ఏపీ రాజధాని అమరావతా కాదా అనే సందేహం కేంద్రానికి కూడా వచ్చినట్టుంది. దీనిపై పలువురు మండిపడుతున్నారు. అన్ని అంశాల్లోనూ ఏపీకి అన్యాయం చేసిన కేంద్రం.. చివరకు ఏపీకి రాజధాని కూడా లేకుండా చేశారని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై అధికార వైఎస్సార్ సీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...