Switch to English

కరోనా కబలించేస్తోంది.. ‘టిమ్స్’ ఏమైంది కేసీఆర్‌ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘వేర్‌ ఈజ్‌ కేసీఆర్‌..’ అంటూ చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల నిర్లక్ష్యంగా వున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. గత కొద్ది రోజులుగా తెలంగాణలో అనూహ్యంగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులే ఇందుకు నిదర్శనం. కరోనా అనుమానితులు, కరోనా పాజిటివ్‌గా తేలినవారు.. వైద్యం విషయమై తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ‘పలు ఆసుపత్రులు తిరిగి, వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన వైనం..’ అంటూ మీడియాలో నిత్యం కథనాలు దర్శనమిస్తుండడంతో, తెలంగాణ ప్రభుత్వంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇక, గచ్చిబౌలి స్టేడియంలో ‘టిమ్స్’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘కరోనా ప్రత్యేక హాస్పిటల్‌’ని సిద్ధం చేస్తున్నట్లు గతంలో ప్రకటించినా, అదిప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ‘దేశంలోనే మొట్టమొదటి హాస్పిటల్‌..’ అని ప్రచారం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర బృందం ఇటీవల ఈ ‘టిమ్స్’ని సందర్శించింది. ‘ఇదిగో అందుబాటులోకి.. అదిగో అందుబాటులోకి..’ అని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా, అది పూర్తిగా ఎప్పటికి రోగులకు సేవలందిస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

అన్నట్టు, ఢిల్లీలో ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్‌ స్పెషల్‌ హాస్పిటల్‌ని రికార్డ్‌ సమయంలో అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా వుంటే, కేంద్రం కరోనా పేషెంట్లకు వైద్య చికిత్స అందించే విషయమై సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం, లక్షణాలు లేనివారికి, స్వల్పంగా లక్షణాలు వున్నవారికి ‘హోం ఐసోలేషన్‌’ సరిపోతుంది. దీన్ని ప్రైవేటు ఆసుపత్రులు అత్యద్భుతంగా వాడేసుకుంటున్నాయి. ‘కరోనా వైరస్‌ కిట్‌ – ప్యాకేజీ’ పేరుతో మేగ్జిమమ్ దండేసుకుంటున్నాయి. ఆసుపత్రుల్లో చేరితే ఇక అంతే సంగతులు. మరి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.?

ప్రభుత్వం తరఫున కూడా వైద్య సహాయం ‘హోం క్వారంటైన్‌’లో వున్నవారికి అందుతున్నప్పటికీ, ఈ విషయమై అవగాహన చాలా తక్కువగా వుంది ప్రజల్లో. ప్రభుత్వ పథకాలకు పబ్లిసిటీ చేసుకునే స్థాయిలో ఇప్పుడు ఈ కరోనా విషయంలో ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, హోం ఐసోలేషన్‌ సంగతెలా వున్నా, ప్రభుత్వ ఆసుపత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి. ఈ క్రమంలో సుమారు 1500 బెడ్స్‌ కలిగిన ‘టిమ్స్’ ఆసుపత్రి పాత్ర అత్యంత కీలకం.

ఓ పక్క ప్రాణాలు కోల్పోతున్నా ‘టిమ్స్’ని అందుబాటులోకి తీసుకురావడంలో అలక్ష్యం ఎందుకు జరుగుతోంది.? అన్న ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సిందే. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకుంటే సరిపోదు.. తెలంగాణలో కరోనా పరిస్థితి అత్యంత భయానకం.. అన్న ‘చెడ్డ’ పేరు రాకుండా ముందే జాగ్రత్త పడాలి. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకనైనా, ప్రభుత్వం మేలుకుని, టిమ్స్ విషయంలోనూ, హోం ఐసోలేషన్‌ విషయంలోనూ మరింత స్పష్టతను ఇస్తుందేమో వేచి చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...