విజయ్ దేవరకొండ లైగర్, ఖుషి చిత్రాల రిజల్ట్ తర్వాత మరింత పగడ్బందీగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు విజయ్ దేవరకొండ.
అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక చిత్రం, రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ తో చేయబోయే చిత్రం కూడా ఉంది. ఫ్యామిలీ స్టార్ తో పాటు రవికిరణ్ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నాడు.
ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ కు యుద్ధం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. 80వ దశకంలో మాఫియా యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. తన కెరీర్ లో ఎక్కువగా ప్రేమకథలు చేసిన విజయ్ కు ఇది కచ్చితంగా కొత్త సినిమా అవుతుందని భావిస్తున్నాడు.