ప్రభాస్ కెరీర్ లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోన్న చిత్రాల్లో సలార్ కూడా ఒకటి. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలవ్వాలి కానీ అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 22న విడుదలవుతోంది. ఈ మధ్య భారీ చిత్రాలు అన్నీ లీక్స్ బారిన పడుతోన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ – శంకర్ చిత్రం గేమ్ ఛేంజర్ చిత్రంలోనుండి కూడా ఒక సాంగ్ లీక్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ నుండి ఒక ఫైట్ లీక్ అయ్యిందంటూ ఒక ట్విటర్ హ్యాండిల్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. లీక్ అయిన ఫైట్ సీన్ కావాలంటే మెసేజ్ చేయండి అంటూ సదరు యూజర్ తెలిపాడు. సాధారణంగానే దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఊహించని విధంగా సలార్ అధికారిక హ్యాండిల్ వారు తమకు కూడా ఆ లీక్ అయిన ఫైట్ సీన్ పంపాల్సిందిగా కోరారు. ఈ ట్వీట్ తో ఎలాంటి ఫైట్ లీక్ అవ్వలేదని కన్ఫర్మ్ అయింది.