విజయ్ దేవరకొండ, సమంత లీడ్ పాత్రల్లో శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఖుషి. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ రేటింగులే తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బిలో యావరేజ్ వసూళ్లు సాధించింది. ఇక గత వారాంతం ఖుషి నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెల్సిందే.
వారం రోజుల నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోని టాప్ 10లో ఫీచర్ అవుతోంది. ఈ రెస్పాన్స్ పట్ల విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. ప్రేమకు భాష లేదు, ఎమోషన్స్ కు బౌండరీ లేదు అనే నమ్మకంతో ఖుషి చేసాం. ఓటిటిలో విడుదలయ్యాక ఈ చిత్రానికి వచ్చిన ఫలితం చూసి చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. ఖుషి చూసాక మీ మనసంతా ఖుషితో నిండిపోవాలని ఆశిస్తున్నా అని తెలిపాడు.
మలయాళ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.