‘సేవ్ నల్లమల’ అంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోరుబాటుకు సిద్ధమవుతున్న విషయం విదితమే. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాల్ని వెలికి తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై నిరసనలు హోరెత్తుతున్నాయి. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లో విస్తరించి వున్న నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపితే, ఆ ప్రభావం పర్యావరణంపై చాలా తీవ్రంగా పడుతుంది. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు వేస్తున్నారు.
మరోపక్క, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ‘సేవ్ నల్లమల’ ఉద్యమానికి మద్దతు పలికాడు. మనిషి తన అవసరాల కోసం భూమ్మీద అన్ని వనరుల్నీ కాలుష్యం చేసేస్తున్నాడనీ, ఈ విధ్వంసం ఇక్కడితో ఆపాలనీ తన ట్వీట్లో పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ. సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ తరఫున నల్లమల వివాదంపై ఇప్పటిదాకా స్పందించిన మరో హీరో విజయ్ దేవరకొండ మాత్రమే కావడం గమనార్హం.
Also Read: పవన్ కళ్యాణ్ ‘యురేనియం’ ఫైట్ ఎవరిపైన.?
ఎక్కడో అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రగిలిందంటూ మన సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేశారు. అలాంటిది, మన తెలుగు రాష్ట్రాల్లో నల్లమల కేంద్రంగా జరగబోతోన్న విధ్వంసంపై స్పందించకపోవడమేంటి.? అన్న విమర్శలు తెలుగు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా నది, నల్లమల అడవుల్లోంచే ప్రవహిస్తుంది. ఆ కృష్ణా నది నీళ్ళు గనుక యురేనియం తవ్వకాల కారణంగా కలుషితమైతే, తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. క్యాన్సర్ సహా అనేక బయంకరమైన రోగాలకు కారణమయ్యే విషతుల్య పదార్థాలు యురేనియం తవ్వకాల ద్వారా నీటి వనరుసల్లో కలిసిపోతాయి.
కడపలో యురేనియం తవ్వకాల కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ పరిస్థితి నల్లమలలో తలెత్తితే, అంతకు మించిన ప్రమాదాన్ని తెలుగు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నల్లమలలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి సానుకూలంగా వ్యవహరిస్తున్న దరిమిలా.. ఈ పోరాటం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
#SaveNallamala pic.twitter.com/zGEe8fVk6N
— Vijay Deverakonda (@TheDeverakonda) September 12, 2019
937442 459639As a result you will demand ultra powerful online enterprise tips to keep operating in acquiring into matters correct your incredible web-based function. MLM 55298
276709 108031Respect to site author , some good selective details . 110123
158271 119575certainly like your internet web site but you need to have to check the spelling on several of your posts. Several of them are rife with spelling issues and I discover it really troublesome to tell the truth nevertheless I will certainly come back once more. 523292
54392 43590Beneficial info and superb style you got here! I want to thank you for sharing your suggestions and putting the time into the stuff you publish! Excellent function! 711541