Switch to English

టెస్టింగ్‌ టైమ్స్: ‘ఫెయిల్డ్‌ తెలంగాణ’ అంటున్నారు కేసీఆర్‌ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

కేంద్రం, మద్యం షాపుల్ని తెరుచుకునేందుకు అనుమతివ్వడానికి ముందు.. ఆ తర్వాత.. ఇలా తెలంగాణలో కరోనా పరిస్థితి గురించి చెప్పుకోవాలేమో. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో కరోనా వైరస్‌ని కట్టడి చేయగలిగింది కేసీఆర్‌ సర్కార్‌. కానీ, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్‌. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తెరవగానే, తెలంగాణ సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు పోటెత్తారు మందుబాబులు. ఇక, అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. తెలంగాణలోనూ మద్యం షాపులు తెరుచుకున్నాయి. క్రమక్రమంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతూ వచ్చింది.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడానికి అనుమతి తప్పనిసరి. అదే ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు రావడానికి ఎలాంటి అనుమతులూ అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం అంతలా వెసులుబాట్లు కల్పించింది. దాంతో, ఆ వెసులుబాట్లను జనం కూడా దుర్వినియోగం చేశారు. మరోపక్క, తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయనే విమర్శలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం, ప్రతిరోజూ అటూ ఇటూగా 10 వేల పరీక్షలు జరుగుతోంటే, తెలంగాణలో అది కేవలం వందల సంఖ్యలోనే వుంది. ఇప్పటికీ తెలంగాణలో మొత్తం పరీక్షల సంఖ్య కేవలం 50 వేలకు అటూ ఇటూగానే వుందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా.? తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా జరగడంపై విపక్షాలు ప్రశ్నించినప్పుడు, ‘ఎక్కువ పరీక్షలు చేస్తే బహుమతులేవీ రావు..’ అని పలువురు మంత్రులే ఎగతాళి చేశారు. కానీ, పరీక్షలు ఎక్కువ చేస్తేనే కదా.. రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్థితి ఏంటో తెలిసేది.?

తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 20 వేలకు పైగా పరీక్షలు ఒక్కరోజులో జరిగిన సందర్భాలున్నాయి. మరి, ఆ స్థాయిలో తెలంగాణలోనూ పరీక్షలు జరిగితే, కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది కదా.! టెస్టింగ్స్‌ పెంచాలంటూ హైకోర్టు ఆదేశించినా, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కన్పించడంలేదు. మరోపక్క, కరోనా చికిత్సకు ప్రధాన కేంద్రం అయిన గాంధీ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా కోసమే ప్రత్యేకంగా టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పుకున్న కేసీఆర్‌ సర్కార్‌.. ఎందుకిలా ఇప్పుడు విమర్శలకు అవకాశమిస్తోంది కరోనా విషయంలో.? ఒకప్పుడు తెలంగాణలో ‘మేం సేఫ్‌’ అని తెలంగాణ ప్రజానీకం భావించింది. కానీ, ఇప్పుడు అదే ప్రజానీకం, ‘తెలంగాణ ఫెయిల్డ్‌’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌లతో హోరెత్తిస్తోంది సోషల్‌ మీడియాలో. మరి, తాజా పరిస్థితులు, పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి పెదవి విప్పుతారా.? వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

రాజకీయం

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

ఎక్కువ చదివినవి

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమాగా నిలిచింది....

Chiranjeevi: ‘వేదికపై మోదీ మా ఇద్దరితో అన్న మాటలు ఇవే..’ చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi: విజయవాడలో నిన్న జరిగిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి-పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ (PM Modi) సంభాషణ, చూపిన ఆప్యాయత కార్యక్రమం మొత్తానికి హైలైట్ అయిపోయింది. ఈ...

Modi-Meloni: మోడీ-మెలోనీ సెల్ఫీ.. మళ్లీ ట్రెండింగ్ లోకి ‘మెలోడి’ హ్యాష్ ట్యాగ్

గతేడాది డిసెంబర్లో దుబాయ్ లో జరిగిన ‘కాప్28’ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ – ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన సెల్ఫీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వారి...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట ఇదే..

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి వెనుదిరిగి చూడలేదు ఈ భామ. ఇటివల...

రఘురామ కేసులో జగన్ అరెస్టయ్యే అవకాశం వుందా.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన...