Switch to English

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,324FansLike
57,764FollowersFollow

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు ఏం చేస్తున్నారు.? అని ఆరాలు తీసినప్పుడు, ‘తాడేపల్లి ప్యాలెస్’లో జగన్ ఏం చేస్తున్నారు.. అని ఆరా తీయడంలో తప్పేమీ లేదు కదా.!

ప్రజా జీవితంలోకి వస్తే, ఎవర్నయినా ఏమన్నా అంటాం.. అని రాజకీయ నాయకులు చెబుతుంటారు. అలా చెప్పేవాళ్ళని కూడా జనం ఏదో ఒకటి అంటుంటారు కదా.! అలాగే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కూడా అంటున్నారు, నానా రకాలుగా అనుకుంటున్నారు.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అధికార పీఠమెక్కేముందు.. వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో సొంత ఇల్లు కట్టుకున్నారు. ఇదే రాజధాని, అందుకే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా.. అని కూడా చెప్పారు జగన్. కానీ, అధికారంలోకి వచ్చాక, అమరావతిని ‘కమ్మరావతి’ అని పేర్కొంటూ, ఆ అమరావతి మీద నానా రకాల దుష్ప్రచారమూ చేశారు.

ఇప్పుడేమో అధికారం ఊడింది.! ఇంతకీ, అమరావతిలోని తాడేపల్లిలోగల వైఎస్ జగన్ ఇంట్లో ఏముంది.? ఆ ఇంటికి, అధికారంలో వుండగా, ప్రజాధనంతో దిద్దిన మెరుగులేంటి.? ఇంటి చుట్టూ దాదాపు ముప్ఫయ్ అడుగుల యెత్తున ఆ రక్షణ కవచాలేంటి.? ఇలా ప్రజల మెదళ్ళలో బోల్డన్ని ప్రశ్నలు.

నిజానికి, వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ అనేది ప్రైవేటు ఆస్తి. అందులోకి తొంగి చూడాలని అనుకోవడం ఎవరికీ తగదు. కాకపోతే, పైన చెప్పుకున్నట్లు.. ‘అందరి జీవితాల్లోకీ వైసీపీ తొంగి చూసిన దరిమిలా, తాడేపల్లి కొంపలోకి కూడా తొంగి చూడాలి కదా..’ అన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న.

ఆ ప్యాలెస్ చుట్టూ సామాన్యులు తిరగకుండా, రోడ్లను బ్లాక్ చేసి పడేశారు గడచిన ఐదేళ్ళుగా. ఇప్పుడు ఆ రోడ్లు సామాన్యుల రోజువారీ అవసరాల నిమిత్తం తెరచుకున్నాయి కూటమి ప్రభుత్వం పుణ్యమా అని.

అలా అటు వెళ్ళే అవకాశం దక్కిన జనం, అక్కడి ఆ ప్యాలెస్ నిర్మాణాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ‘అదిగో, ఆ గేటు.. మనం కట్టిన పన్నులతో నిర్మించుకున్నదే.. ఇదిగో, ఈ రక్షణ కవచానికీ, ప్రజాధనాన్నే వెచ్చించారు..’ అని జనం చర్చించుకుంటున్నారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో, ఆ ముఖ్యమంత్రి రక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందేమో.! ఇప్పుడాయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేత కూడా కాదు.! మరి, ఆ ఖర్చుల్ని వెనక్కి తీసుకోవాలి కదా.? అని జనం మాట్లాడుకుంటోంటే, దాన్ని నిలువరించగలమా.?

‘తాడేపల్లి జగన్ ప్యాలెస్ రహస్యం బట్టబయలవ్వాలి.. అక్కడ నేల మాళిగలే వున్నాయో.. ఇంకేమన్నా వున్నాయో.. వందల కోట్లు కాదు, వేల కోట్లు.. లక్షల కోట్లు మగ్గుతున్నాయేమో..’ అన్న చర్చ జనంలో జరిగే పరిస్థితి ఎందుకొచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానం, చంద్రబాబు ప్రభుత్వం చెబుతుందా.? వేచి చూడాలిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి చేతుల మీదుగా “జస్ట్ ఎ మినిట్” ట్రైలర్...

" ఏడు చేపల కథ" ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన హీరో అభిషేక్ పచ్చిపాల. ఇప్పుడాయన హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా "జస్ట్...

Murari: మహేశ్ ‘మురారి’ వెడ్డింగ్ కార్డు వైరల్.. మూవీ రీ-రిలీజ్ తో...

Murari: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) కెరీర్లో తొలి సూపర్ హిట్ మూవీ ‘మురారి’ (Murari). క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన...

Ram Charan: అంబానీ ఇంటి పెళ్లిసందడిలో మెరిసిన ‘రామ్ చరణ్’

Ram Charan: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. కోట్లాది దేవతల ఆశీర్వాదం.. అంగరంగ వైభవంగా జరిపే వివాహానికి తెలుగు మాటల్లో ఉన్న ఓ నానుడి ఇది....

‘పుష్ప’ గలాటా: అల్లు అర్జున్ గడ్డం తెచ్చిన తంటా.!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2 ది రూల్’ సినిమాకి సంబంధించి రచ్చ తెరపైకొచ్చింది. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ...

R.Narayana Murthy: నటుడు ఆర్.నారాయణమూర్తికి అస్వస్థత..! ఆసుపత్రిలో చేరిక

R.Narayana Murthy: ఆర్.నారాయణమూర్తి.. (R.Narayana Murthy) విప్లవ సినిమాలతో తనకంటూ సొంతంగా స్టార్ స్టేటస్ సాధించుకున్న హీరో. పరిశ్రమలో ఆయనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈక్రమంలో...

రాజకీయం

పదకొండు ప్రభావం: వైసీపీ.. రాజు లేని రాజ్యమైపోయిందే.!

వై నాట్ 175 అనే నినాదాన్ని నిజానికి, వైసీపీ శ్రేణులే నమ్మలేదు. అప్పటి వైసీపీ సిట్టింగ్ ప్రజా ప్రతినిథులూ నమ్మలేదు. కానీ, సాధ్యం కాని విషయాన్ని బలంగా రుద్దేందుకోసం ‘సిద్ధం’ అంటూ కోట్లు...

రేపే అల్పపీడనం.. రాష్ట్రంలో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం గా ఉండాలని సూచించింది. శుక్రవారం మరో...

‘విజయ – శాంతి’ వివాదంపై సజ్జల మౌనం దేనికి సంకేతం.?

అధికారిణి శాంతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య ఏదో సంబంధం వుందంటూ, శాంతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. ఓ...

అయినా గులాబీ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతోందే.!

ఎక్కడ తేడా కొడుతోందో గులాబీ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోలేకపోతోంది.! కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఏమైపోయాయ్.? కేటీయార్ వాక్ చాతుర్యం ఎక్కడికి పోయింది.? అసలంటూ గులాబీ పార్టీ నాయకులకు అధినాయకత్వం నుంచి సరైన...

పవన్ కళ్యాణ్ మీద కార్టూన్: ‘పచ్చ’ బుద్ధి బయటపెట్టుకున్న ఆర్కే.!

టీడీపీ అను‘కుల’ మీడియాలో ఏబీఎన్ ఆర్కేని పెద్ద ముత్తైదువగా పేర్కొంటుంటారు.! కుల జాడ్యం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తిగా ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణకి మీడియా, రాజకీయ వర్గాల్లో ఓ ఘనమైన పేరు ప్రఖ్యాతులున్నాయ్....

ఎక్కువ చదివినవి

జగన్ వర్సెస్ షర్మిల: ‘వైఎస్సార్’ వారసత్వ పోరులో గెలిచేదెవరు.?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి, వైఎస్సార్ కుటుంబంలో రాజకీయ విభేదాల్ని ఇంకోసారి బయటపెట్టినట్లయ్యింది. వైఎస్ విజయమ్మని జగన్ సరిగ్గా ఓదార్చలేదనీ, జగన్ - షర్మిల కలుసుకోలేదనీ.. సంబంధిత వీడియోలు సోషల్...

Peka Medalu: ‘పేక మేడలు’ సినిమా సరికొత్త ప్రమోషన్.. రూ.50కే టికెట్ ధర

Peka Medalu: 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ హీరోగా చేసిన సినిమా ‘పేక మేడలు’ (Peka Medalu). ఓటీటీలో మంచి విజయం సాధించిన...

Santosh Sobhan: యూత్ ఫుల్ లవ్ స్టోరీ.. సంతోష్ శోభన్ హీరోగా ‘కపుల్ ఫ్రెండ్లీ’

Santosh Sobhan: సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ సినిమాను నిర్మిస్తోంది. సంతోష శోభన్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే గ్లింప్స్, టైటిల్...

జగన్ రెడ్డి ఛలో ‘బెంగ’ళూరు.! ఈసారి ఎందుకు పారిపోతున్నట్టు.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారు. వెళితే తప్పేంటట.? వెళ్ళకూడదన్న రూల్ అయితే ఏమీ లేదిక్కడ. కానీ, కాలికి కొన్నాళ్ళ క్రితం తగిలిన గాయానికి సంబంధించి వైద్య చికిత్స నిమిత్తం బెంగళూరు...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 14 జూలై 2024

పంచాంగం తేదీ 14- 07- 2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:36 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:39 గంటలకు తిథి: శుక్ల అష్టమి ప....