Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీకి బ్రాండ్ అయిన మాస్ సినిమాలకు భిన్నమైన ప్రయాణం చేస్తున్నారు వరుణ్. ఈక్రమంలో యాక్షన్, లవ్, కామెడీ, ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు చేశారు.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న ద్విభాషా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valantine). శక్తిప్రతాప్ సింగ్ హడా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో వరుణ్ తొలిసారి హిందీలో అడుగుడితున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు జరిగిన బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కుల బిజినెస్ రికార్డు స్థాయిలో జరినట్టు తెలుస్తోంది. ధియటరికల్ బిజినెస్ కు ఇది అదనం. దీంతో వరుణ్ కొత్త సినిమాపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు వరుణ్ తేజ్ మరో కొత్త సినిమా ‘మట్కా’ కోసం రెడీ అవుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దీంతోపాటు ఈ ఏడాదే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తో వివాహబంధంలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు.