Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈక్రమంలో మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో సందడి చేశారు. ‘వైమానికదళ వీరుల సాహసాల్ని.. దేశాన్ని రక్షించడంలో వారి ధైర్యాన్ని.. ఎదుర్కొనే సవాళ్లు.. వాస్తవాల్ని చూపించడం అరుదుగా వస్తుంది. యువతకు ఇలాంటి సినిమాలు అవసరం. సీరియస్ మోడ్ అయినా వినోదాత్మకంగానే తెరకెక్కించాం’.
‘ఇటువంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం.. ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని ఇచ్చింది. సినిమాకి ముందు పుల్వామా అటాక్ గురించి కొంత తెలుసు. ఇప్పుడు పూర్తిగా తెలుసుకోగలిగా. ప్రేమ, కమర్షియల్ సినిమాలు తీస్తున్నప్పుడు రియల్ హీరోలపై ఎందుకు తీయకూడదనే ప్రశ్నతో ఈ సినిమా మొదలైంది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుం’దని అన్నారు.
పెళ్లి తర్వాత లైఫ్ గురించి ఎదురైన ప్రశ్నకు.. ‘ఎక్కడికెళ్తున్నావ్.. అంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాలెంటైన్స్ డేకి లావణ్య గిఫ్ట్ ఇవ్వలేద’ని సరదాగా అన్నారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానుంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు.