Bollywood: తాను హిందీ సినిమాలు చూడటం మానేసానని ప్రముఖ హిందీ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ (Bollywood) వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో జరిగిన ‘మీర్ కీ ఢిల్లీ, షాజహానాబాద్: ది ఎవాల్వింగ్ సిటీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘హిందీ సినిమాకి 100ఏళ్ల చరిత్ర ఉందని గర్వపడతాం. కానీ.. ఇంకా ఒకే తరహా సినిమాలు తెరకెక్కతున్నాయి. వ్యక్తిగతంగా నన్ను బాధించే అంశం ఇది. అందుకే నేను హిందీ సినిమాలు చూడటం మానేశా. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎవరైతే హిందీ సినిమాలు చూసేందుకు ఉత్సాహం చూపుతారో వారే కొన్నాళ్లకు విసిగిపోవచ్చు. డబ్బు కోసం సినిమాలు తీసే పద్దతి మారి.. వాస్తవాలు చూపించేందుకు దర్శకులు ప్రయత్నించాల’ని అన్నారు.
నసీరుద్దీన్ గతంలో తెలుగు సినిమాలపైనా కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు తాను చూడలేదన్నారు. హీరోయిజాన్ని ఎలివేట్ సినిమాలే ఇవి. ఇటువంటి సినిమాలు చూసి ప్రేక్షకులు ఏం థ్రిల్ ఫీలవుతారో తనకు అర్ధం కాదని అన్నారు.