Switch to English

చంద్రబాబు అలా.. జగన్ ఇలా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఓట్ల లెక్కింపునకు ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నేతలతోపాటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. గెలుపు ఎవరి సొంతం అవుతుందో అని నరాలు తెగే టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేత మధ్య వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రెండు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

వైఎస్సార్ సీపీకి చెందిన నేతలు, అభిమానుల్లో గెలుపు తమదే అనే ధీమా కనపడుతుండగా.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఒకటి రెండు సందర్భాల్లో మినహా బయట ఎక్కడా కనిపించలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు అన్ని పార్టీల అధినేతలూ స్పందించినా.. జగన్ మాత్రం తన నిశ్శబ్దాన్ని కొనసాగించారు. అధికారం తమదేనని, వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఇప్పటివరకు ఎక్కడా ఒక్కసారి కూడా చెప్పలేదు. ఓటింగ్ ముగిసిన దగ్గర నుంచి ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. పొత్తుల కోసం ఎవరి దగ్గర నుంచి ప్రతిపాదనలు వచ్చినా, ఫలితాల తర్వాత చూద్దాం అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కబురు పంపినా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫోన్ చేసినా.. అందరికీ జగన్ సమాధానం అదే. ఈ విషయంలో ఆయన ఎలాంటి తొందరపాటూ ప్రదర్శించడంలేదు. ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నది జగన్ యోచనగా చెబుతున్నారు. అందువల్లే ఎంతటి సీనియర్ నేతల నుంచి ఆహ్వానాలు అందుతున్నా.. ఫలితాలు వచ్చాక చూద్దాం అని వారికి స్పష్టంచేస్తున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. పోలింగ్ దగ్గర నుంచి ఆయనలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈవీఎంలు సరిగా పనిచేయలేదంటూ వాటిపై పోరాటం మొదలుపెట్టిన ఆయన.. తర్వాత క్రమంగా గెలుపు తమదేనని ధీమా కనబరచడం ప్రారంభించారు. టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, నూటికి వెయ్యి శాతం గెలుపు తమదేనని బాబు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. ఒకరిద్దరు మినహా టీడీపీ నేతలు, కేడర్లో ఈ భరోసా మాత్రం కనిపించడంలేదు. మరోవైపు ఫలితాలు రావడానికంటే ముందుగానే విపక్షాల్ని ఏకతాటి పైకి తీసుకురావడానికి బాబు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ, లక్నో, కోల్ కతా, బెంగళూరు వంటి నగరాలు వరుసపెట్టి చుట్టేస్తున్నారు. అన్ని పార్టీల నేతల దగ్గరకూ విసుగు, విరామం లేకుండా తిరుగుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా చర్చలు జరుపుతున్నారు. ఫలితాల కంటే ముందే కూటమి కట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ ఆయన తాజాగా బుధవారం కుప్పంలో గంగమ్మ జాతరలో తొలిసారిగా పాల్గొని మొక్కు కూడా చెల్లించుకున్నారు.

మొత్తమ్మీద చంద్రబాబు, జగన్ ను పరిశీలిస్తే ఇద్దరి మధ్యా ఉన్న వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. గెలుపుపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు.. చంద్రబాబు మాత్రం గెలుపు తమదేనని స్పష్టంచేస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను నమ్మొద్దని బాబు చెప్పగా.. అసలు జగన్ వాటిపై ఎక్కడా స్పందించలేదు. పలు పార్టీల నుంచి జగన్ కు ఫోన్లు వస్తుండగా.. చంద్రబాబే పలు పార్టీల అధినేతల వద్దకు వెళుతున్నారు. వైఎస్సార్ సీపీ కేడర్, నేతల్లో జోష్ కనిపిస్తుండగా.. టీడీపీ నేతలు, కేడర్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు. ఇలా రెండు పార్టీల మధ్య పూర్తి వైరుధ్య పరిస్థితులు నెలకొని ఉండటం ఆసక్తికరంగా కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....