రాజకీయాల్లో మిత్రులు, శత్రువులుగా మారిపోవడం.. శతృవులు, మిత్రులుగా మారిపోవడం క్షణాల్లో జరిగిపోతుంటుంది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం కాస్తా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చిచ్చుపెట్టేలా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం విదితమే. కానీ, తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అంటున్నారు.
‘అక్కడ జగన్, ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేశారు.. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రమే సాహసోపోతమైన నిర్ణయం తీసుకుంది.. మరి, ఆర్థికంగా ఉన్నత స్థితిలో వున్న తెలంగాణ ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతోంది.?’ అంటూ తెలంగాణ ఆర్టీసీకి చెందిన కార్మికులు నినదిస్తున్నారు. కొందరు, ‘జై జగన్..’ అనే నినాదాలు కూడా చేస్తుండడంతో కేసీఆర్ అండ్ టీమ్‌కి ఒళ్ళు మండిపోతోందట.
ఇదొక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అమల్లోకి తెచ్చిన చాలా కొత్త సంక్షేమ పథకాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తలనొప్పిగా మారుతున్నాయంటూ గులాబీ శ్రేణులే ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతుండడం గమనార్హం. మామూలుగా అయితే, కేసీఆర్ – జగన్ మిత్రులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కి వైఎస్ జగన్ తెరవెనుక సహాయ సహకారాలు అందిస్తే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు బాహాటంగానే వైఎస్ జగన్‌కి మద్దతిచ్చారు.
చాలా విషయాల్లో ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ వస్తున్నారు.. ప్రభుత్వాల పరంగా కూడా స్నేహం కొనసాగుతోంది. అయితే, ఇఫ్పుడీ తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. రెండు ప్రభుత్వాల మధ్యా విభేదాలకు ఆస్కారమిచ్చేలానే కన్పిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ సమ్మెకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా నినదిస్తుండడం కొసమెరుపు.
237070 160997I just put the link of your weblog on my Facebook Wall. very nice blog indeed.,-, 214551
888337 698893a good deal lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 966855
175918 768742But wanna comment on couple of common items, The internet site style is perfect, the content material is actually excellent : D. 615848
949515 913056Woh I like your content , saved to favorites ! . 439631
682622 568483Wonderful post will probably be posting this on my blog today keep up the good function. 701347