పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. పోలీసులు కండీషన్స్ పెట్టి కొద్ది మంది అభిమానుల సమక్షంలో వేడుక నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వేడుక నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించక పోవడం పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. పవన్ గురించి త్రివిక్రమ్ మాట్లాడితే వినాలని ఎదురు చూసిన వారికి నిరాశ తప్పలేదు. పెద్ద ఎత్తున విడుదల కాబోతున్న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్ దూరంగా ఉండటంకు కారణం కరోనా అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
త్రివిక్రమ్ గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అందుకే ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమై ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా ఆయన ఎవరిని కూడా కలవడం లేదని అంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందా లేదా అనే విషయమై క్లారిటీ లేదు. కాని త్రివిక్రమ్ కరోనా కారణంగానే వకీల్ సాబ్ వేడుకకు హాజరు కాలేదు అంటూ మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వాదన వినిపిస్తుంది. కరోనా లక్షణాలు ఉన్నా త్రివిక్రమ్ ఆరోగ్యంగానే ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్రివిక్రమ్ ఆరోగ్య పరిస్తితిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
770811 415994Woh I like your articles , saved to fav! . 901858