Switch to English

మరు జన్మకూ మీ ఆస్తులు బదిలీ చేస్తారంట..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఒట్టి చేతులతోనే పుడతాం.. ఒట్టి చేతులతోనే పోతాం.. పోయేటప్పుడు ఎవరూ చిల్లిగవ్వ కూడా మూటగట్టుకుని పోరు.. ఇవీ మానవులకు ఆశ, స్వార్థం ఉండకూడదని సత్పురుషులు చెప్పే మాటలు. కానీ మామూలు జనాలకు ఇవేవీ ఎక్కవు. బతికినంత కాలం దర్జాగా బతకాలి.. బాగా డబ్బు సంపాదించాలి.. తనతోపాటు తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోనంత సొమ్ము ఉండాలని చాలామంది కోరుకుంటారు. చనిపోయేటప్పుడు వెంట తీసుకెళ్లడం కుదరదు కాబట్టి పోతూపోతూ ఒట్టిచేతులతో వెళతారు కానీ.. ఒకవేళ అలాంటి ఏర్పాటు ఉంటే కచ్చితంగా తీసుకెళ్లడానికీ ప్రయత్నిస్తారు.

సరిగ్గా ఇదే పాయింట్ ఆధారంగా ఓ పెద్దాయన మంచి బిజినెస్ మోడల్ ఆలోచించాడు. పెద్ద పెద్ద బిలియనీర్లు లక్ష్యంగా ఓ స్కీమ్ ప్రకటించాడు. ప్రస్తుతం కోటీశ్వరులుగా ఉన్నవారు ఆస్తిలో కొంత భాగాన్ని తమ ట్రస్టుకు ఇస్తే.. వారు చనిపోయిన తర్వాత మళ్లీ ఎక్కడ పుట్టారో కనుక్కుని అప్పుడు ఈ ఆస్తిని తిరిగి ఇస్తారట. ఇందుకోసం కొంత మొత్తాన్ని సర్వీస్ చార్జిగా తీసుకుంటారట. అదిరిపోయింది కదూ ఐడియా? ఇలాంటి స్కీమ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనిపిస్తోంది కదూ?

ఇంతకీ ఈ ఐడియా వచ్చింది ఎవరికా అనేగా మీ సందేహం? ఆయన పేరు రాజీవ్ మల్హోత్రా. భారతీయ అమెరికన్ రచయిత.రెండేళ్ల క్రితం ఢిల్లీ జేఎన్టీయూ విజిటింగ్ ప్రొఫెసర్ కూడా. ఫక్తు హిందుత్వవాది అయిన మల్హోత్రాపై బోలెడు ఆరోపణలూ ఉన్నాయి. రచయితే అయినా.. కథలు కాపీ కొడతాడని టాక్. ఇన్ ఫినిటీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సైతం నిర్వహిస్తున్నాడు. వీడియో లెక్చర్లు ఇస్తుంటాడు. ఇదే తరహాలో తాను రూపొందించిన ‘మరు జన్మకు ఆస్తుల బదిలీ’ కాన్సెప్ట్ ను ఓ వీడియోలో వివరించాడు. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ జన్మలో చనిపోయినవారు మరు జన్మలో ఎక్కడ పుడతారో తాము కనుక్కుంటామని.. అనంతరం ఇప్పుడు వారు తమ ట్రస్టులో జమ చేసిన ఆస్తిని ఇచ్చేస్తారట.

‘ప్రస్తుతం బిలియనీర్ అయిన బిల్ గేట్స్ మళ్లీ జన్మలో పేదోడిగా పుట్టొచ్చు. కోట్లకు అధిపతి అయిన వారెన్ బఫెట్ ఏ ఆఫ్రికాలోని మారుమూల గ్రామంలో జన్మించొచ్చు. ఆగమం ఆధారంగా వారు మరు జన్మలో ఎక్కడ పుడతారో కనుక్కుంటాం. ఆ తర్వాత వారి ఆస్తిని ఇచ్చేస్తాం. వాహనంలో జీపీఎస్ పరికరం అమర్చడం ద్వారా అది ఎక్కడ ఉందో గుర్తించినట్టు.. ఈ జన్మలోని జీవాత్మ మరుజన్మలో ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ పనిచేస్తాం. బిల్ గేట్స్ 50 మిలియన్ డాలర్లు మా ట్రస్టుకు ఇస్తే.. తదుపరి జన్మలో ఆయన ఎక్కడ పుట్టారో గుర్తించి 5 నుంచి 10 మిలియన్ డాలర్లు ఇస్తాం. అది ఆయనకు సంతోషం కలిగించే విషయమే కదా’ అని ఆ పెద్దాయన మల్హోత్రా సెలవిచ్చారు.

ఇదంతా ఎవరితో చెప్పారో తెలుసా? మన వివాదాస్పద స్వామీజీ, కైలాస దేశపు అధిపతి అయిన నిత్యానందుడితో. ఆయన కూడా ఇదో అద్భుతమైన పథకం అని కొనియాడారు. మరికొంచెం రీసెర్చ్ చేస్తే ఇది సాధ్యమేనని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కొంతకాలం క్రితం నెట్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియోపై విపరీతంగా సెటైర్లు వెల్లువెత్తాయి. దీంతో ఆ వీడియోను డిలీట్ చేశారు. కానీ అప్పటికే వైరల్ గా మారిన ఈ వీడియో.. మళ్లీ సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మల్హోత్రా మామూలోడు కాదు గురూ.. అని సెటైర్లు పడుతున్నాయి. ఇంతకీ ఈ బిజినెస్ ప్రారంభమైందా? ముందు నిత్యానందుడినే జమ చేయమనండి అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

6 COMMENTS

  1. 🚀 Wow, blog ini seperti petualangan fantastis meluncur ke galaksi dari kegembiraan! 🌌 Konten yang menarik di sini adalah perjalanan rollercoaster yang mendebarkan bagi pikiran, memicu kegembiraan setiap saat. 🌟 Baik itu gayahidup, blog ini adalah sumber wawasan yang inspiratif! #PetualanganMenanti 🚀 ke dalam pengalaman menegangkan ini dari pengetahuan dan biarkan pikiran Anda terbang! 🚀 Jangan hanya mengeksplorasi, rasakan kegembiraan ini! #BahanBakarPikiran Pikiran Anda akan berterima kasih untuk perjalanan menyenangkan ini melalui ranah keajaiban yang penuh penemuan! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....