ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల్లో అత్యంత ఎక్కువ బజ్ కలిగిన చిత్రం ఏదంటే కచ్చితంగా ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఒకే ఫ్రేమ్ పై కనిపించనుండడం వంటి అంశాలతో ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటినుండే భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి అన్ని భాషల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా తమిళనాడు హక్కులను భారీ ధరకు ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య అమ్మేసిన విషయం తెల్సిందే.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని కర్ణాటకలో ఇద్దరు తెలుగు నిర్మాతలు పంపిణీ చేయబోతున్నారట. ముందుగా కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబేలె ఫిలిమ్స్ పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ సాయి కొర్రపాటి, ఏషియన్ సునీల్ కలిసి కర్ణాటకలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్న విషయం తెల్సిందే.
860453 367255What platform and theme are you employing if I could ask? Exactly where can I buy them? x 97145
232203 925675great post. Neer knew this, regards for letting me know. 660198