Switch to English

కేసీఆర్ నయా భారత్.. నిజమేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

‘తెలంగాణను మంచిగా చేశా.. ఇక దేశం మీద దృష్టి సారిస్తా’ – ఇదీ గతంలో పలు సందర్భాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల సారాంశం. దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన కేసీఆర్ చూపు తాజాగా జాతీయ రాజకీయాల వైపు మళ్లిందని.. త్వరలోనే ఆయన హస్తినలో జెండా పాతడం ఖాయమంటూ కథనాలు ఊపందుకున్నాయి. నిజానికి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఇప్పుడు అనుకోలేదు. గతంలోనే ఇందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి వస్తే ఇబ్బంది అవుతుందని భావించి తెలివిగా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు.

లోక్ సభ ఎన్నికల్లో పూర్తిగా దాని పైనే దృష్టి పెట్టి మొత్తం సీట్లను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా దేశ రాజకీయాలను శాసించాలని భావించారు. కారు, సారు, పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. కానీ 17 సీట్లలో తొమ్మిది మాత్రమే గెలుచుకున్నా. ఇక జాతీయ స్థాయిలో తిరుగులేని మెజార్టీతో మరోసారి మోదీయే అధికారంలోకి రావడంతో కేసీఆర్ సైలెంటయ్యారు. వాస్తవానికి అనుకున్న సీట్లు వచ్చి.. హస్తిన రాజకీయాలను నియంత్రించే పరిస్థితిలో కేసీఆర్ ఉండి ఉంటే, రాష్ట్రంలో కేటీఆర్ ను పట్టాభిషిక్తుడిని చేసి ఆయన ఢిల్లీ బాట పట్టేవారు. కానీ అంచనాలన్నీ తలకిందులు కావడంతో కేటీఆర్ కు సీఎం పగ్గాలు ఇవ్వడాన్ని వాయిదా వేశారు. తాజాగా మరోసారి కేసీఆర్ హస్తిన రాజకీయాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేసి, తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలం కావాలని గులాబీ బాస్ యోచిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రభలో వచ్చిన కథనాన్నే తాజాగా ఆంధ్రజ్యోతి వండి వార్చింది. ఆ పత్రికలు కావాలనే రాశాయా లేక గులాబీ పెద్దలే ఫీలర్ వదిలి రాయించారా అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఫ్రంట్ తరహాలో కాకుండా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పలు ప్రాంతీయ పార్టీలను కలిపి నయా భారత్ అనే మూడో పార్టీ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ వ్యూహమని అంటున్నారు. సంకీర్ణ సర్కారు అంటే బోలెడు తలనొప్పులు ఉంటాయని.. అలా కాకుండా పార్టీ అయితే ప్రాబ్లం ఉండదన్నది దీని వెనుక భావనగా చెబుతున్నారు. అయితే, ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

మమత, హేమంత్ సోరెన్ వంటి వారితో కలిసి ఈ పార్టీ ఏర్పాటు చేయాలనేది గులాబీ దళపతి ఆలోచన అని కథనాలు వస్తున్నాయి. అయితే, అతుకుల బొంతలా ఉండే సంకీర్ణ సర్కారే పూర్తికాలం మనగలగడం అసాధ్యం. అలాంటిది వివిధ పార్టీలు కలిసి పెట్టే కొత్త పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ఏకతాటిపై నడుస్తారా? లుకలుకలు, ఆధిపత్య పోరు లేకుండా ఓ నాయకుడి కింద పని చేయడానికి ఆయా పార్టీలు ఎంతవరకు అంగీకరిస్తాయి అనేది ఇప్పుడే చెప్పలేం. కేసీఆర్ పార్టీ పెట్టడం ఖాయమైన పక్షంలో దాని విధివిధానాలు చూసిన తర్వాతే అంచనాకు రాగలం. నిజానికి తెలంగాణలోనే బోలెడు సమస్యలున్నాయి. మీడియా అండ, అధికార బలంతో టీఆర్ఎస్ నెట్టుకొస్తుంది గానీ, తరచి చూస్తే పలు సమస్యలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ఎంతమంది స్వాగతిస్తారనే సందేహం తలెత్తక మానదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...