విడుదలకు ముందు భారీ అంచనాలు .. భారీ హంగామా .. అత్యంత భారీగా విడుదలైన సాహో పరిస్థితి తారుమారైంది. సినిమా విడుదల తరువాత భిన్నమైన టాక్ వచ్చేసింది. సాహో బాగుంది అనేవాళ్లకంటే .. బాగాలేదనేవాళ్లే ఎక్కువయ్యారు. అటు థియేటర్స్ లో పరిస్థితి అలాగే ఉంది .. ఓపెనింగ్స్ కాబట్టి మొదటి రోజు అన్ని సెంటర్స్ దద్దరిల్లాయి .. మరి రెండు .. మూడో రోజు పరిస్థితి ఏమిటా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో సాహో పై రిపోర్ట్ నెగిటివ్ గానే ఉంది. ఏకంగా 350 కోట్ల భారీ బడ్జెట్ .. అంతగా రాబట్టగలదా అన్న సందేహాలు ఎక్కువయ్యాయి. సాహో నిర్మాతల విషయం పక్కన పెడితే .. భారీ రేటుకు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏమిటి ? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
సాహో రిజల్ట్ తో తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న మెగాస్టార్ సైరా సినిమా పై టెన్షన్ పడింది. వచ్చే నెలలో విడుదల కానున్న సైరా పరిస్థితి ఏమిటీ ? తెలుగు, తమిళ, హింది, మలయాళ భాషలో విడుదల చేస్తున్నారు. బాహుబలి లాంటి హిట్ సినిమా క్రేజ్ ఉన్న ప్రభాస్ సినిమా పరిస్థితి ఇలాగుంటే .. సైరా పరిస్థితి ఇంకెలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది. సాహో ఎఫెక్ట్ తో సైరా బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
సైరా సినిమా ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆ మొత్తం వసూలు చేయాలంటే అదే రేంజ్ లో బిజినెస్ కూడా జరగాల్సి ఉంది. మరి సాహో సినిమా సమయంలో కూడా భారీ రేటుకు పలు ఏరియాల హక్కులు దక్కిచుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు వారి పరిస్థితి అయోమయంలో పడిందని, అందుకే సైరా విషయంలో కూడా ఆచి తూచి అడుగులు వేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు వచ్చిన హైప్ .. సాహో ఎఫెక్ట్ తో డీలా పడిందని దర్శక నిర్మాతలు టెన్షన్ పడుతున్నారట. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.
273703 132235Perfectly indited content material , thanks for selective data . 633590
797486 436732I think this is finest for you: Soccer, Football, Highlight, Live Streaming 208212