ప్రతి ఏడాది ఏదో ఒక హీరో గత హీరో రికార్డ్స్ ని బ్రేక్ చేయడం, మళ్ళీ ఇంకో ఆ హీరో ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ బ్రేక్ చేయడం చాలా కష్టం అన్న రీతిలో ప్రభాస్ ‘బాహుబలి’ సీరీస్ తో కొన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేసేసాడు. అప్పటి నుంచి దాన్ని క్రాస్ చేయడం కష్టం అని నాన్ – బాహుబలి రికార్డ్ అనే ట్రెండ్ ని మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసేలా కలెక్షన్స్ వసూలు చేస్తోంది ‘సైరా నరసింహారెడ్డి’.
స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందిన ఈ సినిమాకి ఇరు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే ‘సైరా’ 62.25 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి అల్ టైం ఫస్ట్ వీక్(7 రోజుల) కలెక్ట్ చేసిన 61.23 కోట్ల షేర్ మార్క్ ని దాటి రికార్డ్ సృష్టించింది. దీంతో ఏపీ-తెలంగాణ ఫస్ట్ వీక్ షేర్స్ లో టాప్ 3లో ఉన్న ‘బాహుబలి-1’ రికార్డ్ ని వెనక్కి తోసి మూడవ స్థానంలో నిలిచింది.
అలాగే మొదటి వారం రోజుల్లో ఏపీ-తెలంగాణ కలెక్షన్స్ పరంగా 73.97 కోట్లతో 2వ స్థానంలో ఉన్న ‘సాహో’ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే దిశగా ‘సైరా’ కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వీక్ పూర్తయ్యే టైంకి పక్కాగా ఏపీ-తెలంగాణలో ‘సాహో’ ఫస్ట్ వీక్ రికార్డ్ ని బ్రేక్ చేసి అల్ టైం టాప్-2 లో కూర్చుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఫుల్ రన్ లో ఏ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అనేది చూడాలి.
486110 227973cool thanks for reis posting! btw are there feeds to your weblog? Id love to add them to my reader 912234
266765 4931Sweet website , super layout, really clean and utilize genial . 838030
22380 93122I dont usually comment but I gotta say thankyou for the post on this incredible 1 : D. 470827