సూర్య .. తమిళంలో సూపర్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే తమిళంలో కంటే కూడా తెలుగులోనే సూర్యకు ఎక్కువ గుర్తింపు ఉందన్న విషయం అందరికి తెలుసు. ఎందుకంటే కెరీర్ మొదటినుండి సూర్య చేసిన ప్రతి తమిళ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేసి ఇక్కడ మంచి విజయం అందుకునేలా ప్లాన్ చేసాడు. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తన సినిమా విడుదల చేస్తూ టాలీవుడ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు. చాలా కాలంగా సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు కానీ అది వర్కవుట్ కావడం లేదు.
ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న సూర్య ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగు రైటర్స్ తో కథా చర్చలు జరుపుతున్నాడట. తాజగా ప్రముఖ రైటర్స్ బివిఎస్ రవి, గోపి మోహన్ లు సూర్య కు ఓ కథ చెప్పారట .. లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టు సమాచారం.
సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్జీకే అట్టర్ ప్లాప్ కావడంతో నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సూర్య ఆ తరువాత హరి దర్శకత్వంలో మరో సినిమా, ఆ తరువాత వేదలమ్ ఫేమ్ శివ దర్శకత్వంలో ఇంకో సినిమాకు కమిట్ అయ్యాడు. సో ఈ సినిమాల తరువాతే సూర్య తెలుగు సినిమా ఉంటుంది .. అంటే వచ్చే ఏడాది సూర్య తెలుగు సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి.
52422 736777I discovered your blog website on google and check a couple of of your early posts. Continue to keep up the extremely very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading far more from you later on! 317336
41799 502655Excellent post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the most effective sequence of my past and your content material kind of reminded me of that period of my life. Cheers 203397
755920 264659Wow, remarkable blog layout! How long have you been blogging for? you make blogging appear effortless. The overall appear of your site is fantastic, as effectively as the content material! 528455