Switch to English

ఇదిగో శ్రీదేవి.. అతిలోక సుందరికి మరణం లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అతిలోక సుందరికి మరణం వుంటుందా.? ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ఆమెని దేవ కన్యగా చూపించిందే నిజం. ఆమె నిజంగానే దేవ కన్య. భూమ్మీదకు వచ్చి, చాన్నాళ్ళపాటు ప్రేక్షకుల్ని అలరించి.. మళ్ళీ దివికేగింది. ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహంలో సజీవ కళ ఉట్టిపడేలా తయారు చేయడం మేడమ్‌ టుస్సాడ్స్‌ నిర్వాహకుల ప్రత్యేకత.

ఇప్పటికే ఎన్నో విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువు దీరాయి. అందులో మన తెలుగు ప్రముఖులకి చెందిన విగ్రహాలు కూడా వున్నాయనుకోండి.. అది వేరే విషయం. బాలీవుడ్‌ నుంచి కొత్త తరం హీరోయిన్లకు చెందిన మైనపు విగ్రహాలకూ కొదవ లేదిక్కడ. ఎన్ని విగ్రహాలున్నా, అతిలోక సుందరి లేకపోతే.. ఆ మ్యూజియంకి పరిపూర్ణత లేనట్లే అనుకున్నారో ఏమో, నిర్వాహకులు శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Sridevi Wax Statue In Madame Tussauds

విగ్రహాన్ని ఎవరైనా చూస్తే, అతిలోక సుందరి జీవించి లేదన్న వాస్తవాన్ని ఒప్పుకోలేరు. అంత అద్భుతంగా ఆ విగ్రహాన్ని మలచారు. విగ్రహంతోపాటు శ్రీదేవి కుటుంబ సభ్యులు పొటో దిగితే.. ఆ ఫొటోలో శ్రీదేవి సహజత్వాన్ని చూసి.. ఆ కుటుంబం ఇంకా నిండుగా అలానే వుందనే భావన అందరికీ కలుగుతుంది. కుమార్తె జాన్వీ కపూర్‌ అయితే తన తల్లి మైనపు విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురైంది.. ఆశ్చర్యపోయింది.. ఆ విగ్రహాన్ని తనతోపాటు తన ఇంటికి తీసుకెళ్లాలని కూడా అనుకుందట.

పెళ్ళయి, ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక సినిమాలకు దూరమైపోయిన శ్రీదేవి, తిరిగి సినిమాల్లో రాణించాలని అనుకుంటున్న సమయంలో.. అనూహ్యంగా మృత్యువాత పడిన విషయం విదితమే. రీ-ఎంట్రీలో ‘పులి’, ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’, ‘మామ్‌’ తదితర సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. మరణం సంగతి పక్కన పెడితే, శ్రీదేవి.. మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఇంకా సజీవంగానే కన్పిస్తోంది మైనపు విగ్రహం రూపంలో.

Sridevi Wax Statue In Madame Tussauds

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...