Switch to English

వైఎస్.. ఓ చెదరని జ్ఞాపకం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైఎస్సార్ అంటే అందరికీ అక్కరకొచ్చే నేస్తం.. ఎంతో మందికి ఆత్మీయ బంధువు.. వెరసి తెలుగు ప్రజల హృదయాల్లో చెదిరిపోని జ్ఞాపకం. స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం.. శరణు కోరితే శత్రువునైనా అక్కున చేర్చుకునే తత్వం.. తాను నమ్మిన విషయంలో ఎంత దూరమైనా వెళ్లే మొండితనం.. ఒక్క వైఎస్ కే సొంతం. కాంగ్రెస్ అధిష్టానం అంటే ఎవరో మాకు తెలియదు.. మాకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్సారే అని ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సందర్భంలో వ్యాఖ్యానించారంటే వైఎస్ ప్రభావం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు కాంగ్రెస్ ను ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన ఘనత నిస్సందేహంగా రాజశేఖరరెడ్డిదే. ఐదేళ్ల మూడు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుని ఉవ్వెత్తున కెరటంలా ఎగసిన ఆయన.. అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసి నేటికి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ మహానేత ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

ఓటమి ఎరుగని ధీరుడు..

1949 జూలై 8న కడప జిల్లా పులివెందులలో జన్మించిన వైఎస్.. ఎంబీబీఎస్ పూర్తి చేసి జమ్మలమడుగు ఆస్పత్రిలో కొంతకాలం పనిచేశారు. అనంతరం 1978లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాజన్న.. అదే ఏడాది పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ విజయం సాధించారు. దీంతో ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. వైఎస్సార్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం 1989 నుంచి 1999 వరకు నాలుగు సార్లు కడప లోక్ సభ స్థానం నుంచి వరుసగా విజయం సాధించారు. 1998 నుంచి 2000 సంవత్సరం వరకు మళ్లీ ఏపీ కాంగ్రెస్ సారథి బాధ్యతలు నిర్వర్తించారు. 1999, 2004, 2009ల్లో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తన జీవితకాలంలో పోటీ చేసిన ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు.

1999 ఎన్నికల్లో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసినా.. ఉమ్మడి ఏపీలో బాగా పట్టు సంపాదించారు. 2003 ఏప్రిల్ 9న ప్రజా ప్రస్థానం పేరుతో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. ఆ సమయంలో వైఎస్ కు జనం జేజేలు పలికారు. తమ కష్టాలు తెలుసుకోవడానికి నాయకుడు వచ్చాడని సంబరపడ్డారు. దీంతో 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సంతకం చేసి శెభాష్ అనిపించుకున్నారు. తర్వాత ఆరోగ్యశ్రీ, 108, రూ.2కే కిలో బియ్యం, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలతోపాటు రైతుకు అవసరమైన పలు సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు.

ముక్కోణపు పోరులోనూ విజేత..

తొలి విడత పాలన చివరికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో వైఎస్ ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయారంగేట్రం చేశారు. దీంతో ఏపీలో ముక్కోణపు పోరు అనివార్యమైంది. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని గెలవగలమా అనే సందేహం అటు పార్టీ అధిష్టానంలో నెలకొంది. అయితే, వైఎస్ మాత్రం చాలా నిబ్బరంగా ఉన్నారు. గెలుపైనా, ఓటమైనా తనదే బాధ్యత అని.. తనపై నమ్మకం ఉంచాలని అధిష్టానాన్ని కోరారు. తన వ్యూహాలతో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి వరుసగా రెండోసారి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చారు. అయితే, 2004లో వచ్చినన్ని సీట్లు రాలేదు. కేవలం 156 స్థానాలు మాత్రమే పరిమితమైంది. దీంతో తమకు ప్రజలు కేవలం పాస్ మార్కులు మాత్రమే వేశారని. ఈ సారి మరింత కష్టపడి పనిచేయాలని ఎలాంటి భేషజాలు లేకుండా వ్యాఖ్యానించారు.

రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. మూడు నెలలకే 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అటవీ ప్రాంతంలో పావురాల గుట్టపై కూలిపోగా.. మరుసటి రోజు హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా మూగబోయింది. రాజన్న లేడనే నిజం జీర్ణించుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి. వైఎస్ మరణంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైభవం కూడా కొడిగట్టింది. ఆ తర్వాత వచ్చినవారు ఎవరూ కూడా వైఎస్ ను మరిపించేలా పాలన చేయలేకపోయారు. ఆయన పాలనలో దాదాపుగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక లబ్ధి పొందిందంటే అతిశయోక్తి కాదు. అందుకే.. రాజన్న ఎక్కడికీ పోలేదు. కుయ్ కుయ్ కుయ్ మనే 108 సైరన్ లో కనిపిస్తారు. ఆరోగ్యశ్రీ చికిత్సలో అగుపిస్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో ప్రతిఫలిస్తారు.. వెరసి ప్రజల గుండెల్లో భద్రంగా ఒదిగిపోయారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...