Switch to English

పెద్దలంటే అంత ‘శ్రద్ధ’ లేకపోతే ఎలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కొత్తమ్మాయ్‌ శ్రద్ధా శ్రీనాధ్‌ చాలా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. నిన్న జరిగిన ‘జెర్సీ’ ఆడియో విడుదల వేడుకలో పదే పదే ‘నా పేరు శ్రద్ధా శ్రీనాధ్‌..’ అని చెప్పుకుంది. అలా చెప్పుకోవడానికి కారణమిదీ.. అంటూ తాను ఓ గొప్ప నటిని అనే విషయాన్ని ఇంకా గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నించింది. శ్రద్ధా శ్రీనాధ్‌ నటిగా ‘యూ టర్న్‌’ సినిమాతో కన్నడలో గుర్తింపు తెచ్చుకుంది. అదే సినిమా తెలుగులోకి సమంత హీరోయిన్‌గా రీమేక్‌ అయ్యింది. తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. నటిగా సమంత ఏంటో తెలుగు ప్రేక్షకులకూ, తమిళ ప్రేక్షకులకూ తెలుసు. అయితే శ్రద్ధా శ్రీనాధ్‌ మాత్రం సమంత నటన తనకు నచ్చలేదనీ పరోక్షంగా చెప్పింది.

‘తెలుగు ‘యూటర్న్‌’ 30 నిముషాలు కూడా చూడలేకపోయాను.. నేను చేసిన అద్భుతమైన పాత్రలో ఇంకొకర్ని ఊహించుకోలేకపోయాను..’ అనడం ద్వారా, శ్రద్ధా తన అహంకారాన్ని చాటుకుంది. దానికి తగ్గట్లుగానే సోషల్‌ మీడియాలో సమంత అభిమానుల నుండి తీవ్రాతి తీవ్రంగా ట్రోలింగ్‌ ఎదుర్కొంటోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రద్దాకి ఈ ట్రోలింగ్‌ గురించి తెలియదని ఎలా అనుకోగలం.? తెలిసి కూడా తన అహంకారాన్ని అలాగే కొనసాగిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ వాతావరణాన్ని అర్ధం చేసుకోవడానికి కనీస ప్రయత్నం చేయలేదామె. వాస్తవానికి ఏ సినీ పరిశ్రమలోనైనా సీనియర్స్‌ని గౌరవించాల్సిందే. తద్వారా తమ తర్వాతి తరానికి మార్గదర్శకులైనట్లుంటుంది.

‘జెర్సీ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్‌ హాజరయ్యారు. యంగ్‌ తరంగ్‌ని ఉత్సాహపరిచేందుకు సీనియర్‌ హీరో రావడం చాలా గొప్ప విషయం. కానీ తన స్పీచ్‌లో శ్రద్ధా శ్రీనాధ్‌ వెంకటేష్‌ని మర్చిపోయేసరికి అంతా షాక్‌కి గురయ్యారు. స్టేజ్‌ మీద సొంత డబ్బాకే పరిమితమైంది శ్రద్ధా. ప్రసంగం ముగించి వెళ్లిపోయిన శ్రద్ధా కొంత సేపటి తర్వాత మళ్లీ వేదిక పైకొచ్చి మైకు అందుకుని మొక్కుబడిగా వెంకటేష్‌ గురించి ఓ రెండు మాటలు చెప్పి వెళ్లిపోయింది. ఇక్కడ వెంకటేష్‌ గురించి మాట్లాడడం అంటే శ్రద్ధా శ్రీనాధ్‌ తనను తాను గౌరవించుకున్నట్లు. మాట్లాడకపోవడమంటే తనను తాను అవమానించుకున్నట్లు. తెలుగు సినిమాకి పెద్ద దిక్కులాంటి అతి కొద్ది మందిలో వెంకటేష్‌ కూడా ఒకరిప్పుడు.

షర్టు నలగకుండా వచ్చి రెండు మాటలు చెప్పేసి వెళ్లిపోవచ్చు. కానీ స్టేజ్‌ మీద సరదాగా క్రికెట్‌ ఆడి, అందర్నీ అలరించారాయన. అది ఆయన పెద్ద మనసు. తన ప్రెజెన్స్‌తో ‘జెర్సీ’ సినిమాకి అదనపు పబ్లిసిటీ రావాలి అన్న ఆలోచనతో వెంకటేష్‌ ఈ వేడుకకు హాజరయ్యారు. అలాంటి వెంకటేష్‌ని గౌరవించుకోవడం, ప్రతీ ఒక్కరి ధర్మం. హీరోయిన్‌గా ఆ బాధ్యత శ్రద్ధా శ్రీనాధ్‌కి మరింత ఎక్కువ ఉంది. వెంకటేష్‌ కాకుండా, ఇంకో సీనియర్‌ హీరో ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తే, తర్వాతి పరిణామాలు వేరేగా ఉంటాయి.

టాలెంట్‌ ఒక్కటీ సరిపోదు, దానికి తోడు అణుకువ చాలా ముఖ్యం. ఆ అణకువ లేకపోతే కెరీర్‌లో నిలదొక్కుకోవడం చాలా కష్టమని చాలామంది నటీనటులు తమ కెరీర్‌ అటకెక్కాకగానీ తెలుసుకోలేకపోయారు. కొందరు మాత్రం తమ తప్పుల్ని త్వరగానే సరిదిద్దుకుని కెరీర్‌లో ముందడుగు వేశారు. మొన్న సమంతపై కామెంట్స్‌తో వివాదం.. నిన్న విక్టరీ వెంకటేష్‌ విషయంలో అత్యుత్సాహం.. ఇక్కడితో శ్రద్ధా శ్రీనాద్‌ తన అతికి ఫుల్‌స్టాప్‌ పెడుతుందా.. ఇంకా కొనసాగిస్తుందా..? వేచి చూడాలిక.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...