యంగ్ హీరో శర్వనంద్ పుట్టిన రోజు సందర్బంగా నేడు ఆయన నటిస్తున్న మహాసముద్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో శర్వానంద్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి సమాచారం అందుతోంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. శర్వానంద్ ను కొత్తగా ఈ సినిమాలో చూపించేందుకు అజయ్ భూపతి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్యాలెంటెడ్ హీరోగా క్లాస్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న శర్వానంద్ ను మాస్ కు దగ్గర చేసేందుకు పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ను దర్శకుడు అజయ్ భూపతి నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు సీనియర్ హీరో సిద్దార్థ కూడా కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబో సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు. అధితి రావు హైదరి మరియు అను ఎమాన్యూల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఫస్ట్ లుక్ లో శర్వాలుక్ తో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
848139 887004Definitely worth bookmarking for revisiting. I surprise how so much effort you set to create the sort of excellent informative website. 79700
711210 944909You completed several great points there. I did specific searches on the concern and discovered several folks go in conjunction with along together with your blog. 735323