Switch to English

Sai Tej Birthday special: మెగా ఫ్యామిలీలో మరో స్టార్.. సుప్రీం హీరో ‘సాయితేజ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ కావాలి.. ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఎప్పుడూ కష్టపడాలి.. సినిమా సినిమాకీ రాటు దేలాలి.. మొత్తంగా నటుడిగా నిరూపించుకోవాలి.. నిలబడాలి..’ తీవ్రమైన పోటీ ఉన్న సినీ పరిశ్రమలో ప్రతి నటుడికీ ఇది నిరంతర ప్రక్రియ. ఈ సూత్రాల్ని తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు సాయితేజ్ (సాయి ధరమ్ తేజ్). తెలుగు సినిమా రారాజు.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఆయన అండదండలతో సినిమా రంగంలోకి వచ్చిన హీరోల్లో సాయితేజ్ ఒకరు. మావయ్యలు తెలుగు సినిమాను శాసించి.. అశేష ప్రేక్షకాదరణ చూరగొన్నవారు. కొత్త తరంగా ప్రేక్షకుల మధ్యకు రావడానికి ఇంతకంటే పెద్ద పునాది లేదు. అయినా.. తొలి సినిమా నుంచీ తానేంటో నిరూపించుకుంటూనే ఉన్నారు. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్.. ఇలా ప్రతి జోనర్లో సినిమాలు చేసి ప్రేక్షకుల్ని తన టాలెంట్ తో మెప్పించిన హీరో ఆయన. నేడు సాయితేజ్ పుట్టిన రోజు.

మేనమామ చిరంజీవి తరహాలోనే..

బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ తర్వాత తెలుగులో మెగా ఫ్యామిలీలోనే నటులు.. హీరోలు ఎక్కువ. అందరికీ అభయహస్తం చిరంజీవి. వీరి ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో ముఖ్యంగా మెప్పించాల్సింది చిరంజీవి అభిమానుల్నే. ఈ పనిని సులువుగా సాధించారు సాయితేజ్. మేనమామ చిరంజీవి పోలికలన్నట్టే.. సినిమాల్లో కూడా ఆయనకు తగ్గట్టే క్లాప్ కొట్టిన తొలి సినిమా ‘రేయ్’ కాకుండా రెండో సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదటగా రిలీజై సక్సెస్ కూడా సాధించింది. తొలి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ తో కాకుండా పక్కింటి కుర్రాడిలా దర్శకుడు వైవీఎస్. చౌదరి దృష్టిని ఆకర్షించి హీరో అయ్యారు సాయితేజ్. ఇదే ఆయన మొదటి గెలుపు. అటుపై ఆయన వెనుదిరిగి చూడలేదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే వంటి హిట్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన కెరీర్లో ప్రత్యేకం ‘రిపబ్లిక్’ సినిమా. సీరియస్ సినిమాను తనదైన నటనతో మెప్పించారు.

అవరోధం దాటి సక్సెస్..

కెరీర్ సాయితేజ్ కు ఎదురైన కష్టం బైక్ యాక్సిడెంట్. ఏకంగా చిత్రపరిశ్రమనే కలవరపెట్టిన అంశం. దానిని దాటి ‘విరూపాక్ష’తో హిట్ కొట్టి 100కోట్ల క్లబ్ టచ్ చేసారు. ‘బ్రో’ సినిమాతో అలరించారు. ఓదశలో వరుస ఫ్లాపులున్నా భయపడలేదు. నిర్మాతలూ వెనకడుగేయలేదు. సాయితేజ్ సత్తాకు ఇది నిదర్శనం. ఎవరి సినిమా విడుదలవుతున్నా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం. సమాజంపట్ల బాధ్యతగా ఉండాలని.. బైక్ ప్రయాణంలో హెల్మెట్ ధరించాలని పిలుపునివ్వడం.. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు. సాయితేజ్ పై పవన్ కల్యాణ్ ప్రభావం ఎక్కువ. గురువుగా భావిస్తారు. ప్రస్తుతం సాయితేజ్ పూర్తి కమర్షియల్ కథతో ST17 సినిమా ప్రారంభించబోతున్నారు. భవిష్యత్తులో సాయితేజ్ మరిన్ని విజయాలు సాధించాలని మెగా ఫ్యామిలీ పేరు ప్రఖ్యాతుల్ని మరింతగా పెంచాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ‘తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...