Switch to English

ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ: ఆ విషయంలో మావయ్య పిలుపు కోసం ఎదురుచూస్తున్నా: సాయి ధరమ్ తేజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న తెలుగు సినిమా కావడంతో అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా రిలీజ్ గురించి ఏమంటున్నాడు? ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? అతని మాటల్లోనే చూద్దాం.

లాక్ డౌన్ తర్వాత విడుదలవుతోన్న మొదటి తెలుగు చిత్రం మీదే. ఎలా అనిపిస్తోంది?

చాలా ఉత్సాహంగా ఉంది. రీసెంట్ గా షూటింగ్ కోసం ఈ మధ్య ఏలూరు వెళ్ళినప్పుడు అక్కడి జనాలు మమ్మల్ని చూడటానికి ఉత్సాహం చూపించారు. యాడ్ షూటింగ్ విషయంలో కూడా అదే జరిగింది. నేను అనుకుంటున్న దాని ప్రకారం ప్రజలు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను మిస్ అవుతున్నారు. థియేటర్లలో సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నారు.

నభ నటేష్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి?

ఆమె చాలా హార్డ్ వర్కింగ్. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా బాగుంటుంది. నభ నటేష్ తన పాత్రను ఓన్ చేసుకుంది. అమృత పాత్రలో కనిపిస్తుంది.

మీరు చాలా ఛారిటీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వీటి వెనుక మీ స్ఫూర్తి ఎవరు?

నా తల్లి. ఆమెతో పాటు మావయ్య చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ నన్ను ఆయన చాలా విధాలుగా స్ఫూర్తినిచ్చారు. స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. ఛారిటీ విషయంలో కూడా ఆయనే నాకు స్ఫూర్తి. నేను ఈ సమాజానికి చేయగలిగింది ఏమైనా ఉందా అంటే అది అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడమే. అది నా బాధ్యతగా భావిస్తాను.

మీ దర్శకుడు సుబ్బు గురించి చెప్పండి.

సుబ్బు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. అదే అతణ్ణి దర్శకుడ్ని చేసిందని నమ్ముతాను. తన క్రాఫ్ట్ కు చాలా డెడికేటెడ్ గా ఉన్నాడు. తన విజన్, హార్డ్ వర్క్ వల్లే సోలో బ్రతుకే సో బెటర్ సాధ్యమైంది.

ఈ చిత్ర ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. ప్రతిరోజూ పండగే ఆల్బమ్ కూడా సూపర్ హిట్టే. రెండిటికీ థమన్ సంగీత దర్శకుడు. ఇలా వరసగా రెండు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ కు కారణమేంటి?

దానికి మా ఇద్దరి మధ్య స్నేహం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మేమిద్దరం చాలా క్లోజ్. అదే మేజర్ ప్లస్ పాయింట్. అందుకే మా కాంబినేషన్ లో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఎక్కువ వచ్చాయి. అయితే నా కన్నా దర్శకులు పాటలు సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణమని నమ్ముతాను నేను.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి

ప్రస్తుతం దేవ కట్టా సినిమాలో నటిస్తున్నాను. కొత్త దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి పనిచేయబోతున్నాను. ఈ రెండూ కాకుండా మరో ప్రాజెక్టును కూడా ఒప్పుకున్నాను.

చిరంజీవి గారితో నటిస్తున్నారన్న వార్తలపై మీ స్పందన?

మెగా ఫ్యామిలీలో నేను తప్ప అందరూ మావయ్యతో నటించాడు. నా తమ్ముడు కూడా మావయ్య సినిమాలో యాక్ట్ చేసాడు. నేను ఆ అవకాశం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను. ఆయన నుండి ఒక్క పిలుపు వస్తే చాలు నేను అక్కడ ఉంటాను.

నిహారిక వివాహ వేడుకలో మీది, పవన్ ఫోటో బాగా వైరల్ అయింది. అది ఏ సందర్భంలో తీసుకున్నది?

అక్కడి నుండి పవన్ కళ్యాణ్ గారు వెళ్లిపోతున్నారు. నేను వెనకాల నుండి వచ్చి ఒక ఫోటో అడిగాను. దానికి ఆయన ఏరా? ఇప్పటిదాకా నాతో ఫోటో దిగలేదా అని ఫన్నీగా అన్నారు. అది కాదు ఇది ఒక మెమరీగా చిరకాలం గుర్తుండిపోతుంది అనగానే ఫోటో దిగాం.

నిహారిక పెళ్లిలో ఎలా ఎంజాయ్ చేసారు?

చాలా అంటే చాలా. ముఖ్యంగా నేను, నా తమ్ముడు ఈ పెళ్ళిలో ఫోన్లను పక్కనపెట్టేయాలని నిర్ణయించుకున్నాం. పెళ్లి వేడుకను పూర్తిగా ఎంజాయ్ చేసాం. మా సొంత సోదరి వివాహంలాగే మేము ఈ పెళ్ళి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నాము.

వరుణ్ తేజ్ తో మల్టీస్టారర్ ఎప్పుడు?

నేను, వరుణ్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. మేమిద్దరం కలిసి నటించడానికి సిద్ధంగానే ఉన్నాం. సరైన స్క్రిప్ట్ వస్తే వెంటనే ఓకే చెబుతాం.

మీరు మంచి రేసర్ అని విన్నాం. నిజమేనా?

(నవ్వుతూ) లేదండీ. నాకు బైక్స్ అంటే ఇష్టం అంతే. నిజానికి నాకు క్రీడలంటే ఆసక్తి ఎక్కువ.

అసలు సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని ఇలా విడుదల చేయడానికి ప్రధాన కారణమేంటి?

లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులకు చాలా సహాయం చేసాం. అయితే అందరం థియేటర్ ఓనర్ల గురించి మర్చిపోయాం. నేను విడివిడిగా వారితో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళల్లో నీళ్లు తిరగడం నేను గమనించాను. అప్పుడే నిర్ణయించుకున్నా. వీలైనంత త్వరగా వారికోసమైనా నా సినిమాను విడుదల చేయాలని. అనుకున్న విధంగా విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను.

మీమ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? మీ మీద వచ్చే మీమ్స్ ను ఎలా తీసుకుంటారు?

మీమ్స్ మంచివైనా, చెడ్డవైనా నేను పాజిటివ్ గానే ఉంటా. నిజానికి మీమర్స్ జాబ్ చాలా కష్టమైంది. వారి క్రియేటివిటీకి నిజంగా హ్యాట్సాఫ్.

మీ నిర్మాత గురించి ఒక్కమాటలో చెప్పాలంటే?

మోస్ట్ ఎనర్జిటిక్.

చివరిగా పైరసీ గురించి ఏం చెబుతారు?

సినిమాను పైరసీ చేసే వారి గురించి నేనేం మాట్లాడలేను. ఎందుకంటే వారు బ్రతుకుతోంది దాని మీదే. అయితే పైరసీను సపోర్ట్ చేయకండి అనే నేను ప్రేక్షకులను కోరుతున్నా. థియేటర్లలోనే సినిమాను చూడండి.

ఇంటర్వ్యూ బై హరీష్

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...