300 కోట్లతో రూపొందిన సినిమా.. అంతే స్థాయిలో బిజినెస్ అయ్యిందనే ప్రచారం.. అందుకు తగ్గట్టుగా పెరిగిన రేట్లు, క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు అత్యధిక సంఖ్యలో షోలు.. ఇలా అన్నీ చేశారుగానీ, ‘సాహో’ సినిమా దారుణంగా దెబ్బతినేసింది. నిజానికి, ఈ దెబ్బ ఇప్పుడు కొత్తగా తగిలిందేమీ కాదు, ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన సినిమా, ఆగస్ట్ 30కి పోస్ట్ పోన్ అవడంతోనే ఎక్కడో తేడా కొట్టిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలే నిజమయ్యాయిప్పుడు.
అసలు ‘సాహో’ కథ ఎలా వుంటుంది.? సినిమాలో దర్శకుడు సుజీత్ ఎంత కొత్తదనం చూపిస్తాడు.? అనే విషయమై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, ప్రభాస్ నమ్మాడు సుజీత్‌ని. నిర్మాతలూ ముందూ వెనుకా చూడకుండా పెట్టుబడి పెట్టేశారు. ‘బాహుబలి’ మాయలో అందరూ పడిపోయారు. అదే ‘సాహో’ సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. నిజానికి ‘సాహో’ సినిమా కోసం తొలుత అనుకున్న బడ్జెట్ వేరు, ఆ తర్వాత మారిన ఈక్వేషన్స్ వేరు. ‘ఎలివేషన్’ మీదనే ఫోకస్ పెట్టి, సినిమాని నిండా ముంచేశాడు దర్శకుడు.
ఇక్కడ పూర్తిగా దర్శకుడ్ని కూడా ఏమీ అనడానికి వీల్లేదు. ‘100 కోట్లు మిగుల్చుకునే అవకాశాన్ని కాదనుకుని, అవసరానికి మించి ఖర్చు చేశారు..’ అని ప్రభాస్ స్వయంగా, సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో సెలవిచ్చాడు. అంటే, ప్రభాస్‌కి ‘సాహో’ రిజల్ట్ మీద ఓ క్లారిటీ వుందన్నమాట. అయినా, జనాన్ని ఏమార్చే ప్రయత్నం చేయడం బాధాకరం.
ఇప్పుడు ఇదే విషయమై విపరీతంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. వేరే హీరోల అభిమానులు ‘సాహో’ మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తే అదో లెక్క.. సాక్షాత్తూ ప్రభాస్ అభిమానులే, నిర్మాతలపైనా, హీరోపైనా.. ఆఖరికి హీరోపైనా ట్రోలింగ్ చేసేస్తున్నారు.
760507 919956Hey! Im at work surfing about your weblog from my new apple iphone! Just wanted to say I really like reading by means of your blog and appear forward to all your posts! Maintain up the outstanding function! 687945
517630 405602whoa, this is a really great piece of data. I read about something like this before, this is impressively excellent stuff. 119348