మూడు వైపులా రష్యన్ సైనికులు చుట్టుముట్టడంతో ఉక్రెయిన్ వణుకుతోంది. ప్రధాన నగరాలు, సైనిక స్థావరాల్ని వరుసగా చేజిక్కించుకుంటున్న సేనలు.. ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో.. ఏ క్షణంలోనైనా కీవ్ రష్యా సైన్యం చేతుల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ ట్యాంకర్లు, బలగాలు బాంబులు, తూటాల వర్షం కురిపిస్తున్నాయి. ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువవుతున్న తరుణంలో.. ఉక్రెయిన్‌తో ఉన్నతస్థాయి చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు.
అయితే.. ఉక్రెయిన్‌లో ప్రభుత్వాన్ని స్థాపించాలనేది పుతిన్ లక్ష్యమని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను భూమార్గాల్లో రొమేనియా, హంగరి సరిహద్దులకు తరలించి.. అక్కడి నుంచి విమానాల్లో భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలను విదేశీ వ్యవహారాలశాఖ పరిశీలిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు పెంచేందుకు యూరోపియన్ యూనియన్‌తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పుతిన్‌తో పాటు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్కు చెందిన ఆస్తులను స్తంభింపజేసేందుకు ఈయూ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
688849 34636Wow you hit it on the dot we shall submit to Plurk in addition to Squidoo effectively done انواع محركات الطائرات | هندسة نت was excellent 199903