కొన్ని రోజులుగా ఉక్రెయిన్ పై భీకర దాడి చేస్తున్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ఉక్రెయిన్ లోని మరియుపోల్, వోల్నవోఖ్ నగరాల్లో పౌరులను తరలించేందుకు ఈ అవకాశం కల్పించింది. ఈమేరకు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు త్వరగా తరలిపోవాలని కూడా రష్యా ఆదేశించింది.
అయితే.. ఈ రెండు నగరాలను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడించాయి. దీంతో స్థానికంగా ప్రజలకు కొద్ది రోజులుగా ఆహారం, తాగునీరు, విద్యుత్, హీటింగ్, రావాణా సదుపాయాలను రష్యా సేనలు నిలిపివేశాయి.
మాస్కో కాలమానం ప్రకారం మార్చి 5న ఉదయం దాదాపు 11 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రారంభమయింది. తాత్కాలిక కాల్పుల విరమణ సుమారు ఐదున్నర గంటలపాటు అమలవుతుందని తెలుస్తోంది. ప్రపంచ దేశాల నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు రష్యా ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినట్టు తెలుస్తోంది.
935276 11336Hello fellow internet master! I actually enjoy your site! I liked the color of your sidebar. 574595
593581 987308I enjoy your composing design, do carry on creating! I will be back! 242993