కేవలం ‘భీమ్లానాయక్’ సినిమాని దెబ్బ కొట్టాలి.! తద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టాలి.! ఇది తప్ప, ఆంద్రప్రదేశ్‌లోని అధికార పక్షానికి ఇంకో సోయ లేకుండా పోయింది. రాత్రికి రాత్రి ఆంద్రప్రదేశ్‌లోని సినీ ప్రేక్షకులంతా పేదోళ్ళయిపోయినట్లు, వాళ్ళకి సినిమా టిక్కెట్ల ధరల్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం థియేటర్ల దగ్గర మోహరించేసింది. థియేటర్లలోనూ అధికారులు నానా హంగామా చేశారు.
మరి, ఏదీ ఇప్పుడా అధికార యంత్రాంగం.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల దగ్గర ఎందుకు అధికారులు కనిపించలేదు.? ‘రాదేశ్యామ్’ సినిమా సమయంలోనూ వాళ్ళెందుకు కనిపించలేదు.? ‘రాధేశ్యామ్’ సినిమాకిగాను ఒక్కో టిక్కెట్ 500 రూపాయలు ఆ పైన బ్లాక్ మార్కెట్లో ఫ్లాట్ రేట్ అమ్మేశారు. కానీ, అక్కడెక్కడా అధికారులు చర్యలు తీసుకోలేదు.
‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మరీ దారుణం. టిక్కెట్ ధర ఫ్లాట్ రేట్.. అంటూ బ్లాక్ మార్కెట్లో వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల దాకా పెంచేశారు. అంతేనా, బెనిఫిట్ షోలన్నారు, స్పెషల్ షోలన్నారు.. అబ్బో, వైసీపీ గతంలో ఏదైతే జరగకూడదని చెప్పిందో, అదే జరుగుతున్నా.. ప్రభుత్వం నోరెళ్ళబెట్టినట్టు చూసింది. ప్రభుత్వాన్ని నడుపుతోన్న వైసీపీ నుంచి ఒక్క నేత కూడా ఈ వ్యవహారంపై పెదవి విప్పడంలేదు. ఏ మంత్రి కూడా సినిమాపై రివ్యూ చెప్పడంలేదు.
అంటే, రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్‌లో సినీ ప్రేక్షకులు ధనవంతులైపోయారన్నమాట. ఎంత ఖర్చు చేసైనా సినిమా చూడగలిగే స్థోమత రాష్ట ప్రజలకు కలిగేలా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ కొద్ది రోజుల్లోనే సంచలనాత్మకమైన రీతిలో అభివృద్ధి చేసేసిందన్నమాట.
ఇదీ సోషల్ మీడియా వేదికగా ఆంద్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల వ్యవహారం, తాజా పరిణామాలపై జరుగుతున్న చర్చ తాలూకు సారాంశం. అన్నట్టు, ‘భీమ్లానాయక్’ సినిమాని థియేటర్లలోఅడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైన అధికార పక్షం, ఓటీటీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు దిక్కుమాలిన తెలివితేటలు ప్రయోగించలేదెందుకో.!
579647 762515If running proves to be a issue then it could be wise to discover alternative exercises such as circuit training, weight training, swimming or cycling. 524923
741609 25423Howdy just wanted to give you a brief heads up and let you know several of the pictures arent loading properly. Im not positive why but I think its a linking concern. Ive tried it in two different internet browsers and both show exactly the same outcome. 535005
432976 542771Hey, you used to write amazing, but the last few posts have been kinda boringK I miss your great writings. Past few posts are just a bit out of track! come on! 176612