Switch to English

పమ్మినేని రామ్‌రామ్‌.. ఆర్జీవీకి ‘ఆ’ ఉద్దేశ్యం లేదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పమ్మినేని రామ్‌రామ్‌.. అంటూ ఓ కొత్త క్యారెక్టర్‌ని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా నుంచి రివీల్‌ చేశాడు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. స్పీకర్‌ ఛెయిర్‌లో పమ్మినేని, ఆ పైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాలూకు లోగో. ఇంతకీ, ఈ పమ్మినేని రామ్‌రామ్‌ ఎవరు? ఈ ప్రశ్నకు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ పేజీలోనే చాలామంది తమ సమాధానాల్ని కుండబద్దలుగొట్టేశారు. ఆ పమ్మినేని ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత స్పీకర్‌ తమ్మినేని సీతారాం అని.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ్మినేని కునుకు తీశారంటూ ఓ ఫొటో అప్పట్లో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమయ్యింది. దాన్ని వర్మ, ఇదిగో ఇలా వాడేశాడన్నమాట. కమెడియన్‌ అలీ, తమ్మినేని సీతారాం పాత్రలో కన్పిస్తున్నాడు. అలీ వైసీపీ నేత అని అందరికీ తెలుసు కదా.! అంటే వైసీపీ నేతతోనే, వైసీపీ నేత మీద రామ్‌గోపాల్‌ వర్మ సెటైర్‌ వేయించబోతున్నాడన్నమాట. మామూలుగా అయితే, రాజకీయ నాయకులపై ఇలాంటి సెటైర్లు సర్వసాధారణమే.

స్పీకర్‌ లాంటి ప్రత్యేకమైన పదవుల్లో వున్నవారిపై సెటైర్లు వేస్తే, ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయి. అసలంటూ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌ మీదనే పెద్ద రచ్చ జరుగుతోంది. కులాల కుంపట్లను రగిల్చే టైటిల్‌ అది. ఇప్పటికే నమోదైన కేసులు, నమోదు కాబోతున్న కేసుల గురించి చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇదసలు రిలీజయ్యే సినిమానే కాదు. సెన్సార్‌ కత్తెర వేటు తప్పదు. టైటిల్‌ మార్చుకోవాల్సిందే.. చాలా చోట్ల బ్లర్‌ చేసుకోవాలి.. చాలా డైలాగ్స్‌కి బీప్‌ పడటం ఖాయం.. ఇంతా చేసినా సినిమా విడుదలవుతుందన్న గ్యారంటీ లేదు’ అంటున్నారు చాలామంది.

ఆ సంగతేమోగానీ, పమ్మినేని రామ్‌రామ్‌ క్యారెక్టర్‌ రిలీజ్‌ అయ్యాక, వైసీపీ ప్రభుత్వం ఈ సినిమాని విడుదల చేయనిస్తుందా.? అన్నదిప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒకవేళ విడుదలకు అనుమతిస్తే మాత్రం, ఏపీ స్పీకర్‌కి వైసీపీ పొమ్మనలేక ఇలా రామ్‌గోపాల్‌ వర్మ ద్వారా పొగపెడ్తున్నట్లే భావించాల్సి వస్తుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...