Switch to English

BRS: ‘కారు’ చిచ్చు కి కారణమేంటి? అతి విశ్వాసమే కొంప ముంచిందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి దాదాపుగా పూర్తయినట్లే. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. భారతీయ రాష్ట్ర సమితి అనూహ్య ఓటమికి కారణాలేంటి? పదేళ్లుగా రాష్ట్రంలో పదేళ్లుగా చక్రం తిప్పిన ఆ పార్టీ ఎన్నికల్లో ఒక్కసారిగా ఎందుకిలా చతికిలపడింది? కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్లు బీఆర్ఎస్ ఓటమికి కూడా అంతే. ఇదీ కారణమని చెప్పడానికి లేదు.

పార్టీ పేరు మార్పు స్వయంకృతాపరాధం

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పదేళ్లకు పైగా పోరాటం చేసిన కేసీఆర్.. రాష్ట్రం పేరుని తన పార్టీ పేరుగా పెట్టుకున్నారు. పార్టీ పెట్టిన కొత్తల్లో ఓ వేదికపై కేసీఆర్ మాట్లాడుతూ ‘నా బిడ్డలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. వాళ్లు ఇక్కడికి రారు. ఇక్కడ ఉన్నది నేను నా భార్య మాత్రమే. రాష్ట్ర ప్రజలందరూ నా బిడ్డలే. కాబట్టి పార్టీకి కూడా తెలంగాణ పేరు పెట్టుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణపై పేటెంట్ హక్కులన్నీ తనవే అంటూ చెబుతూ వచ్చిన కేసీఆర్.. ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఇలా పార్టీ పేరు మార్చడం వల్ల తెలంగాణ పై సర్వహక్కులు వదులుకున్నట్లు అయింది. దీని వెనక కారణాలు ఏవైనప్పటికీ సీఎం నిర్ణయం మాత్రం చాలా మందికి మింగుడు పడలేదు. పైపెచ్చు విమర్శలకు దారితీసింది.

పుట్టి ముంచిన సిట్టింగ్ సీట్స్

బీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదన్న అభిప్రాయాలు వెల్లువత్తాయి.ఆ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వచ్చింది. స్వయంగా ఆయనే ఒకానొక సందర్భంలో 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని వారిని కచ్చితంగా మారుస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలకు భిన్నంగా ఒకేసారి 105 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అందులో సిట్టింగ్ అభ్యర్థులే ఎక్కువ ఉండటం గమనార్హం. అభ్యర్ధులని చూసి కాకుండా తనను చూసి ఓటేస్తారని నమ్మిన కేసీఆర్ కి ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు.

కేసీఆర్ భయపడ్డారా ?

2018 ఎన్నికల్లో గజ్వేల్ లో మాత్రమే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన కేసీఆర్..ఈసారి మాత్రం అందుకు భిన్నంగా రెండు చోట్ల పోటీ చేస్తున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాజకీయ చాణక్యుడిగా పేరుందిన కేసీఆర్ ఓడిపోతానన్న భయంతోనే ఇలా రెండుచోట్ల పోటీ చేస్తున్నట్టు ప్రకటించారన్న విమర్శలకు తావిచ్చారు. అది కూడా పార్టీకి పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది. కామారెడ్డి లో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు గజ్వేల్ లోను క్రితం సారి కంటే మెజారిటీ తగ్గింది.

డెవలప్మెంట్ హైదరాబాద్ లోనేనా ?

‘ఓట్ ఫర్ డెవలప్మెంట్’ ఇదీ ఈసారి బీఆర్ఎస్ ఎన్నికల నినాదం. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓటేయండని ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థులందరూ గట్టిగానే చెప్పారు. అయితే అభివృద్ధి కేవలం అర్బన్ నియోజకవర్గాల్లో మాత్రమేనా? గ్రామీణ నియోజకవర్గాలను పట్టించుకోరా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. హైదరాబాద్ ని డెవలప్ చేయడంలో పెట్టిన శ్రద్ధ రాష్ట్రంలోని ఇతర ముఖ్య ప్రాంతాలపై పెట్టలేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

రైతుల ఆక్రందన పట్టించుకోలే

రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం దాన్ని సమర్థంగా నిర్వహించడంలో విఫలమైందని చెప్పాలి. ఈ పథకం ద్వారా భూ యజమానులు లాభపడ్డారు తప్పితే కౌలు రైతులకు ఒరిగిందేమీ లేదు. భూ సమస్యల ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన ధరణి పైన కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మారు పేర్లతో భూములు నమోదు అవ్వడం, సరిహద్దు వివాదాలు, అసైన్డ్ భూముల వివాదం, సర్వే నంబర్లలో గందరగోళం వంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటినేవి పట్టించుకోలేదు. రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కనీసం తప్పుల్ని సవరించుకునే ప్రయత్నం కూడా జరగలేదు.

చేటు తెచ్చిన పేపర్ లీకేజీలు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని ఆశించిన యువతకు రిక్త హస్తం ఎదురైంది. గతేడాది హడావిడిగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనుకున్న విధంగానే విడతల వారీగా ఆయా శాఖలో ఖాళీలను భర్తీ చేసే దిశగా టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. సరిగ్గా పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ అవ్వడం పెద్ద దుమారమే రేపింది. ఏళ్ళకేళ్ళు ఉద్యోగాల కోసం సిద్ధమైన యువతకి ఒకసారిగా గుండె పగిలినట్టు అయింది. అంతకుముందు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తప్పిదాల వల్ల 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా కేసీఆర్ ప్రభుత్వానికి చేటు చేసింది. ఈ రెండు ఘటనలు యువతలో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి.

వీటితోపాటు తెలంగాణ కేసీఆర్ మానస పుత్రికగా అభివర్ణించిన కాలేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం వాటికి సదరు ఇంజనీర్లు పొంతనలేని సమాధానాలు చెప్పడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వీటన్నింటినీ కాంగ్రెస్ సరిగా క్యాష్ చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అధికార ఏర్పాటుకు బాటలు వేసుకుంది.

148 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...