ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రిపై కూర్చోబోతున్నారు అనుముల రేవంత్ రెడ్డి.! మామూలుగా అయితే, రెడ్డి మరియు రెడ్డి.! కానీ, ఇక్కడ రెడ్డి వర్సెస్ రెడ్డి.!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందర.. అదీ, అనూహ్యంగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద గలాటా. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, జలవనరుల శాఖ అధికారులు మొదలెట్టిన, పొలికల్ డ్రామాలాట.! తెలంగాణలోని అధికార బీఆర్ఎస్‌కి రాజకీయంగా లబ్ది చేకూర్చేందుకు ఏపీలోని అధికార వైసీపీ ఆడిన డ్రామా ఇది.
పోలింగ్ అయిపోగానే, గలాటా ఏమీ లేకుండా పోయింది. ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం వ్యవహారాలు కేంద్రం కంట్రోల్‌లోకి వెళ్ళిపోయాయి. మామూలు విషయం కాదిది.! నిజానికి, రెండు రాష్ట్రాల్లోని పార్టీలు, అవి నడుపుతున్న వ్యవస్థల వ్యూహాత్మక వైఫల్యమిది.
ఈ విషయం కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థం కాకుండా వుంటుందా.? ఖచ్చితంగా, ఈ విషయమై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠమెక్కాక రివ్యూ చేసి తీరతారు. సరే, అది వేరే వ్యవహారం.!
రేవంత్ రెడ్డిని వైసీపీ గతంలో ఏ స్థాయిలో తూలనాడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి ఆయన బదులు తీర్చుకోవాలి కదా.? బీఆర్ఎస్, వైసీపీ గతంలో కలిసి ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. వాటన్నిటినీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా కాకపోయినా.. వ్యక్తిగతంగా అయినా, రివ్యూ చేసుకుంటారు.
కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి ద్వారా, ఏపీలోని వైసీపీ మీద రివెంజ్ డ్రామాకి ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది. అలా రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబుకి సహకరిస్తే, కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా లాభం చేకూర్చినట్లే అవుతుంది. ఇదంతా నాణేనికి ఓ వైపు.!
మరో కోణం ఏంటంటే, తెలంగాణలో బోల్డంత అభివృద్ధి జరిగినా, బోల్డన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నా, తెలంగాణ ఓటర్లు గులాబీ పార్టీని తిరస్కరించారు. ఏపీ తరహాలో సామాజిక పెన్షన్ల వ్యవస్థను తెరపైకి తెస్తామని కేసీయార్ స్వయంగా ప్రకటించినా, తెలంగాణ ఓటర్లు లైట్ తీసుకున్నారు. దీనర్థమేంటి.?
ఏముంది.? ఏపీలో అధికార పార్టీకి అక్కడి ఓటర్లు వచ్చే ఎన్నికల్లో షాక్ ఇవ్వబోతున్నారనే కదా.!