తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ‘జమిలి బాంబు’ పేల్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తే, జమిలి ఎన్నికలతో చంద్రబాబుకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. వైసీపీకి అడ్వాంటేజ్ వుంటుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, ‘జమిలి’ గురించి ఉత్త జోస్యం చెబుతారని అనుకోలేం. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నెట్వర్క్ చాలా స్ట్రాంగ్‌గానే వుంటుంది. సో, జమిలి ఎన్నికలపై చంద్రబాబు దగ్గర ఖచ్చితమైన సమాచారమే వుండి వుండొచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ‘తూచ్, జమిలి అనే ఆలోచనే మాకు లేదు’ అని ఏపీకి చెందిన బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించేశారు. కానీ, కేంద్రం ‘జమిలి’ ఆలోచన ఎప్పటినుంచో చేస్తోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడే ఈ జమిలి గుసగుసలు విన్పించాయి. 2024 లోపు ఖచ్చితంగా జమిలి ఎన్నికలు వస్తాయని జాతీయ స్థాయిలో ఒకింత గట్టిగానే చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టే కేంద్రం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందన్న వాదనలూ లేకపోలేదు. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. అన్నది జమిలి కాన్సెప్ట్. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, పార్లమెంటు ఎన్నికల కోసం ఇంకోసారి కసరత్తులు చేయాల్సిన తలనొప్పిని ఎన్నికల కమిషన్ భరిస్తోంది. దీన్నుంచి వెసులుబాటు కోసమే ఈ జమిలి ప్రతిపాదన తెరపైకొచ్చింది. కానీ, అందులోనూ చాలా సమస్యలున్నాయి. ఈ రోజుల్లో ఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో చెప్పడం కష్టం.
అలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుప్ప కూలితే, వెంటనే జమిలి అనడం కుదరదు కదా. అలాగని రాష్ట్రానికి తక్కువ కాల పరిమితితో మళ్ళీ ఎన్నికలంటే అదీ కష్టమైన ప్రక్రియే. ఇక్కడే జమిలి ప్రక్రియపై గందరగోళం.. ఆ ప్రక్రియ ఆలస్యమవడానికి కారణమవుతోంది. కానీ, ఈసారి పక్కాగా.. 2024 లోపే జమిలి ఎన్నికలు జరపాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ భావిస్తోంది. ‘పరిస్థితులు అనుకూలం’ అని కేంద్రంలోని మోడీ సర్కార్ భావిస్తే.. (అనగా బీజేపీకి అనుకూలం అన్నమాట) 2023-2024 మధ్య జమిలి ఎన్నికలు జరగొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
569721 691080Gems form the internet […]very few websites that happen to be detailed below, from our point of view are undoubtedly nicely worth checking out[…] 193145
549337 744424Normally I do not learn post on blogs, nonetheless I would like to say that this write-up extremely pressured me to take a look at and do so! Your writing style has been surprised me. Thank you, quite great post. 78564
618016 764705Ive been absent for a while, but now I remember why I used to really like this site. Thank you, I will try and check back much more often. How frequently you update your web site? 468634
688325 594175Your writing is fine and gives food for thought. I hope that Ill have much more time to read your articles . Regards. I wish you that you regularly publish new texts and invite you to greet me 114409